నాని డామినేషన్ నాగ్ తట్టుకోగలడా?
విభాగం: సినిమా వార్తలు
is-nani-dominating-nag_g2d

హీరోగా ఒక స్థాయి అందుకోవడానికి టైం పట్టింది కానీ.. నటుడిగా నాని టాలెంట్ ఏంటన్నది తొలి సినిమా ‘అష్టాచెమ్మా’లోనే అందరూ చూశారు. తొలి సినిమా అన్న బెరుకు ఏమీ లేకుండా చాలా సహజంగా నటించి.. రాంబాబు పాత్రను రక్తి కట్టించాడు నాని. 

ఆ తర్వాత అతను చేసిన ప్రతి పాత్రలోనూ ప్రత్యేకత చాటుకున్నాడు. చాలా సాధారణమైన కథల్ని కూడా తన యాక్టింగ్ టాలెంట్‌తో మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత నానికి దక్కుతుంది. ఇప్పుడతను అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరోతో కలిసి ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు. నాగార్జునకు ఎంత సీనియారిటీ ఉన్నా.. నటుడిగా అద్భుతమైన పాత్రలు చేసినా.. ఈ చిత్రంలో నాని డామినేషన్ తట్టుగోలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీజర్ చూశాక ఇలాంటి డౌట్ రాకుండా ఎలా ఉంటుంది మరి?

నిమిషంలోపు నిడివి ఉన్న టీజర్లో నాని డామినేషన్ క్లియర్‌గా కనిపించింది. నాగ్ మందు సర్వ్ చేస్తుంటే నీళ్లు కానీ.. సోడా కానీ కలపకుండా రా కొట్టేసే పాత్రలో నాని అదరగొట్టేశాడంతే. అతడి హావభావాలే టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాగార్జున సాధారణంగానే కనిపించాడు టీజర్లో. ఇందులో నాగ్ డాన్ పాత్ర చేస్తుండగా.. నాని డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అతడి లుక్, హావభావాలు చూస్తుంటే కొంచెం భయస్తుడిగా కనిపించేట్లున్నాడు. 

పాత్ర కొంచెం టిపికల్‌గా ఉంటే నాని ఎలా చెలరేగిపోతాడో చెప్పేదేముంది? నాగార్జునకు ఎంత సీనియారిటీ ఉన్నా కూడా.. ఎన్నో గొప్ప పాత్రలు చేసినా.. నటుడిగా ఆయనకు కొన్ని పరిమితులు ఉన్న మాట వాస్తవం. ‘ఊపిరి’లో సైతం ఆయన్ని కార్తినే డామినేట్ చేశాడు. ఇప్పుడు కార్తిని మించి పెర్ఫామర్‌తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.  చరిష్మా విషయంలో నాగ్ డామినేషన్ ఉండొచ్చు కానీ.. నటన విషయంలో మాత్రం నానీనే పైచేయి సాధిస్తాడని అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి అతడి డామినేషన్‌ను నాగ్ ఎలా తట్టుకుంటాడో?

 

 

 

SOURCE:GULTE.COM

25 Aug, 2018 0 322
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved