గాజువాకలో జనసేన ప్రసంగం
విభాగం: రాజకీయ వార్తలు
janasana-speech-in-gajuwaka_g2d

గాజువాకలో ఉక్కు నిర్వాసితులతో జరిగిన సమావేశంలో జనసేనాని  ప్రసంగం  :  

* సమస్యను ఎవరి దగ్గర నుండో వినడానికి, స్వయంగా తెలుసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే నేను మీ దగ్గరకి వచ్చి తెలుసుకుంటున్నా...

* 26 వేల ఎకరాలు భూములు పోగొట్టుకుని, దేవుడి గుడిలో ప్రసాదాలు తీసుకునే పరిస్థితి మీకు వచ్చినందుకు చాలా బాధ కలుగుతుంది, కంటతడి పెట్టించింది.

* 25 సంవత్సరాలు పని చెయ్యడానికి రాజకీయాలలోకి వచ్చా..ఓట్లు అడగటానికి రాలేదు అని నేను 2014 లో పార్టీ పెట్టినప్పుడే చెప్పా..

* హైద్రాబాద్ లో  కొన్ని దశాబ్దాలు నుండి ఉంటున్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెద్దదిగా చేసుకోవడానికి కాళీ చేయించేశారు. అందుకే నేను 2007లో కాంగ్రెస్ ను తిట్టా..

* నా బిడ్డ ఒక్కరే బాగుంటే సరిపోదు, అందరి బిడ్డలూ బాగుండాలి. నేను ఇంత స్థాయికి రావడానికి అందరి తల్లులు కారణం.

* నేను ప్రభుత్వం లో గాని ఉండుంటే కచ్చితంగా సమస్యని ముందుకు తీసుకువెళ్ళేవాణ్ణి, ఎంతోకంత తీర్చడానికి ప్రయత్నించే వాడిని...

* ఎక్కడ భూములు తీసుకున్నా నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి. భూములు లాగుకోవడానికి వున్న శ్రద్ద పరిహారం ఇవ్వడంలో ఎందుకు ఉండదు?

* 150 సంవత్సరాలు బ్రిటీష్ వాళ్ళు పాలిస్తే కొంతమంది నాయకుల వచ్చి వాళ్ళని తరిమికొట్టారు, మేము కూడా 39 సంవత్సరాలు నుండి పోరాడుతున్నాం మనం సాధించుకోవాలి అని బలంగా అనుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తుంది.

* జనసేన పార్టీ పెట్టినప్పుడు ఓట్లు అడగటానికి నాకు సిగ్గేసింది, అందుకే పోటీ చెయ్యలేదు. పోటీ చెయ్యడం, గెలవడం నాకు తేలిక. కానీ సమస్యలను తెలుసుకోకుండా పోటీ చెయ్యడం ఎందుకు?

* ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. నాయకులు అందరూ సమస్య మనది అనుకుంటే కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది.

* ఇక్కడికి నేను ఎలక్షన్ల కోసమో, మేనిఫెస్టో కోసమో రాలేదు. మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చా...చచ్చిపోతే గుర్తింపు రాదు, మనం చచ్చిపోతే దోపిడీ చేసినోడు గెలుస్తాడు, మనం ఓడిపోతాం. మనం బతికి వుండి సమస్యను పరిష్కరించుకోవాలి.

* నేను సమస్యల మీద ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తా...మీ సమస్యలను తెలుసుకోవడానికే అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నా..

* నాయకులు సమస్యలను పట్టించుకునే విధంగా వారిలో మనం బాధ్యత తీసుకురావాలి.

* వీళ్ళందరూ పాలిటిక్స్ లో ఎమోషన్స్ పనికి రావు అంటున్నారు. పాలిటిక్స్ లో ఎమోషన్స్ తోనే వేర్పాటువాదాలు తీసుకొస్తారు. పాలిటిక్స్ లోకి జనసేన మానవత్వవాదాన్ని తీసుకు వస్తుంది

 

SOURCE:JANASENA

07 Jul, 2018 0 389
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved