కోటిలింగాల అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి లోను చేసింది అని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు
విభాగం: రాజకీయ వార్తలు
janasena-chief-shri-pawan-kalyan-has-said-that-the-fire-of-the-kotilingungs-was-shocking_g2d

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. కోటిలింగాల అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి లోను చేసింది అని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

వరంగల్ జిల్లా కోటిలింగాల దగ్గర చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది కార్మికులు మృత్యువాతపడటం చాలా బాధ కలిగించింది. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. బాణాసంచా గోదాములో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. ఆ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలకి తావు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది అని తెలిపారు

 

SOURCE:JANASENA

05 Jul, 2018 0 322
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved