
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో గల కత్తవపాడు గ్రామంలో జనసేన వీర మహిళల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన వీర మహిళా విభాగం నుండి శ్రీమతి ప్రభావతి వసంతాల గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మహిళలకు జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యత మరియు జనసేన సిద్ధాంతాలను వివరించారు. పవన్ కళ్యాణ్ గారికి మహిళలు పట్ల వున్న గౌరవమే ఈనాడు జనసేన వీర మహిళ ఏర్పడడానికి కారణం అని తెలియజేసారు. ఇప్పటి ప్రభుత్వం మహిళలను కించపరచడమే కాకుండా, అన్నీ రంగాలలో అణచివేయడం వల్లనే మహిళలు ఎదగలేకపోతున్నారని, మహిళలకు ఇప్పటి ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వడం లేదు అని తెలిపారు.
మహిళలకు జనసేన పార్టీలో లభిస్తున్న గౌరవాన్ని, ప్రాముఖ్యతను ప్రభావతి గారు వివరించారు. జనసేన పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద వున్న నమ్మకాన్ని కొంత మంది మహిళలు తోటి వారికి తెలియజేసారు
SOURCE:JANASENA