రెండు వేల బస్సులు అంటే ఆషామాషీగా ఉందా
విభాగం: రాజకీయ వార్తలు
kannababu-comments-on-babu_g2d

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం పేరుతో ప్రజాదనాన్ని విచ్చలవిడిగా వ్యయం చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.కన్నబాబు విమర్శించారు. దీక్ష కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. దీక్షకు ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, పెన్షనర్లను బలవంతంగా తరలించారని ఆరోపించారు. దీక్ష పేరుతో 2 వేల ఆర్టీసీ బస్సులను సభాస్థలికి తరలించడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వివరించారు. 2000 వేల బస్సులు అంటే ఆషామాషీగా ఉందా? ఆ లెక్కన ఈ బస్సులలోనే లక్ష మంది దాకా వచ్చి ఉండాలి. మరో వైపు సభలో చంద్రబాబు చేసిన కామెడీ చూసి జనం ఫుల్లుగా నవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. ధర్మపోరాట దీక్ష అని కేంద్రం చేసిన అన్యాయం పై చంద్రబాబు నాయుడు సభ పెడితే వైకాపా వారికి ఉలిక్కి పాటు ఎందుకు? అటువంటి దీక్షలు పోరాటాలు వారు చెయ్యాల్సింది పోయి చేసే వాళ్ళని అవహేళన చెయ్యడమేంటో? ఇటువంటి వైఖరిని ప్రజలు హర్షిస్తారా?

 

 

SOURCE:MIRCHI9.COM

30 Jun, 2018 0 458
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved