
బిగ్‌బాస్ విన్నర్‌ని ఎప్పుడో మూడవ వారంలోనే ఫిక్స్ అయిపోయారు జనం. కౌశల్‌ని కార్నర్ చేసి తమ ఆధిపత్యం, అజమాయిషీతో అతడిని బయటకి పంపాలని చూసిన హౌస్‌మేట్స్‌కి వ్యతిరేకంగా ఆర్మీ ఫార్మ్ అయి కౌశల్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎలాగైనా అతడి ప్రాభవం తగ్గించి వేరే వారికి టైటిల్ ఇవ్వాలని బిగ్‌బాస్ గట్టిగా ట్రై చేస్తున్నాడు.
అయితే ఇంతవరకు కౌశల్ ఫాలోయింగ్‌ని ప్రభావితం చేయలేకపోయారు. ఇన్‌ఫ్యాక్ట్ జనాలకి అతనిపై వున్న పిచ్చి ఇంకా పెరుగుతోంది. రోడ్డు మీదకి వచ్చి 2కె రన్ చేసే లెవల్‌కి అతడిని ఆరాధిస్తున్నారు. ఓటింగ్స్లో ఇప్పటికీ కౌశల్ ఆధిపత్యం కొనసాగుతున్నా కానీ హౌస్‌లో మిగిలిన ఇద్దరు లేడీస్ నుంచి అతడికి ఇబ్బంది ఎదురవుతోంది. గీతా మాధురికి ఆడవాళ్లలో ఫాలోయింగ్ వుంది. ముఖ్యంగా ఫోన్ లైన్ ఓటింగ్స్లో గీత ప్రభావం బాగా కనిపిస్తోంది.
మరోవైపు టీవీ9 యాంకర్ దీప్తి నల్లమోతుకి కూడా ఓట్ల పరంగా రిగ్గింగ్ జరుగుతోందనేది స్పష్టమవుతోంది. ఓటింగ్ మొదలైనపుడు అసలు ఓట్లు పడక, ఆ తర్వాత రాత్రికి రాత్రి ఓట్లు పడడం ఆమె ట్రెండింగ్‌లో రెగ్యులర్‌గా జరిగే సంగతి. కౌశల్‌కి లక్షల మంది ఓట్లు వేసే సైన్యం వుంది కనుక అతనికి చింత వుండకూడదు. కానీ ఒకవైపు అతడిని కార్నర్ చేసి బ్యాడ్ లైట్లో చూపించాలనే ప్రయత్నం బిగ్‌బాసే చేస్తున్నపుడు కౌశల్‌కి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు దిన దిన గండమే అవుతుందనడంలో సందేహం లేదు.
SOURCE:GULTE.COM