అరెస్టులు...దేనికి సంకేతం....
విభాగం: రాజకీయ వార్తలు
kcr-fears-of-power-so-arresting-congress-leaders_g2d

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భయపడుతున్నారు. ముందస్తు ఎన్నికల్లో విజయం దక్కదని ఆందోళన చెందుతున్నారా. ఈ సారి కూడా తానే ముఖ‌్యమంత్రి అనుకుంటున్న సమయంలో ఎదురుదెబ్బలు తగులుతాయా అని సందేహిస్తున్నారా..... అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

దీనికి సంకేతమే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను అరెస్టు చేయడం.... మరికొందరిపై కేసులు పెట్టడం అంటున్నారు వారు. ఎప్పుడో 2004 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసును 14 సంవత్సరాల తర్వాత బయటకు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న కేసు ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి తీసుకు వచ్చారు. 

ఈ కేసులో జగ్గారెడ్డి అర్దరాత్రి అరెస్టు చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం కేసులు పెట్టడం ఇంతకు ముందు ఎప్పుడు జరగా లేదని అంటున్నారు. నాయకులపై కేసులు పెట్టి వారిని బెదిరింపులకు గురి చేయడం రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. 

నిజానికి ఈ కేసులో వాస్తవ ముద్దాయిలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన మేనల్లుడు హరీష్ రావులేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. గతంలో పాస్‌పోర్టు వివాదంలో వీరిద్దరూ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపణ. మరోవైపు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి కూడా జూబ్లీ హిల్స్ పోలిసులు నోటిసులు జారీ చేయడం వివాదం అవుతోంది. 

జూబ్లీ హిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటి పేరుతో తప్పుడు ద్రువ పత్రాలు స్రుష్టించారంటూ కేసు నమోదు చేసారు. 2002లో జరిగిన ఈ ఉదంతం దాదాపు 16 సంవత్సారాల తర్వాత బయటకు తీయడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసుల వెనుక కే. చంద్రశేఖర రావు ఓటమి భయమే కారణమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యనిస్తున్నారు రానున్న ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి ఖయమని కె. చంద్రశేఖర రావు ముందగానే తెలిసిందని దీంతో ఆయన కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

ప్రజల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులపై కేసులు పెడుతున్న పోలిస్ అధికారుల జాబిత తయారు చేస్తున్నామని తాము అధికారంలోకి వస్తే ఆ అధికారులకు వడ్డీతో సహ చెల్లింపులు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

 

 

 

SOURCE:GULTE.COM

13 Sep, 2018 0 346
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved