రొమాన్సా...సిగ్గేస్తుంది, ముద్దులు పెట్టను: కీర్తి
విభాగం: సినిమా వార్తలు
keerthysuresh-no-for-kisses_g2d

సీన్ డిమాండ్ చేస్తే.. లిప్ కిస్సులకు సిద్ధం..అనేది ఈ కాలం హీరోయిన్ల రొటీన్ పలుకు. కథ అవసరం కొద్దీ అలాంటి సీన్లు చేస్తామని చెబుతుంటారు. అంతేనా... అక్కడ ముద్దు సీన్ తప్పనిసరి అయ్యింది.. అని వీళ్లే చెబుతారు. తాము ఆ సీన్లు చేయడం గురించి అలా వివరణలు ఇచ్చుకుంటారు. బికినీల విషయంలోనూ అంతే. అప్పటికప్పుడు అనుకున్నాం..అక్కడ బికినీ ప్రాముఖ్యత గురించి దర్శకుడు వివరించాడు.. అందుకే అలా.. అని వీళ్లు ఇచ్చే వివరణలు సరదా సరదాగా ఉంటాయి.

అయితే ఈ రొటీన్ మాటలు చెప్పడం లేదు కీర్తీ సురేష్. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే తనకు చాలా సిగ్గేస్తుంది అని అంటోంది ఈ భామ. తెరపై రొమాంటిక్ సన్నివేశాలు చేయాలంటే తను చాలా సిగ్గుపడిపోతానని చెబుతోంది. తనకు సిగ్గెక్కువ అని అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించలేనని అంటోంది.

ఇక ముద్దు సీన్ల విషయానికి వస్తే... అలాంటి వాటిల్లో చేయమని ఇప్పటి వరకూ తనను ఎవరూ అడగలేదు అని, ఇకపై కూడా అలాంటి సన్నివేశాల్లో నటించను అని కీర్తి స్పష్టం చేసింది. తను ముద్దు సీన్లలో నటించే ప్రసక్తే లేదని ఇలా స్పష్టం చేసింది కీర్తి సురేష్.

అయినా ఎక్స్ పోజింగ్ చేయాల్సిన అవసరం లేకుండా, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం లేకుండా, మూతి ముద్దులు పెట్టాల్సిన అవసరం లేకుండా... ఈమె సినిమాలు హిట్ అవుతున్నాయి. కాస్త లేట్ గా అయినా తెలుగులో కూడా టాప్ హీరోలతో కీర్తి అవకాశాలను సంపాదించుకుంటోంది. కాబట్టి.. ఇప్పుడు నచ్చనివి చేయాల్సిన అవసరం లేదు కదా!

 

SOURCE:GREATANDHRA.COM

30 Jun, 2018 0 442
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved