మహేష్ ఫైనల్ లుక్ ఇదేనా
విభాగం: సినిమా వార్తలు
mahesh-is-the-final-look_g2d

తన 25వ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేస్తోన్న ప్రిన్స్ మహేష్ బాబు, సరికొత్తగా గడ్డం, ఎక్కువ జుట్టుతో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ పిక్స్ తో పాటు, పలు సినీ ఈవెంట్లలో మహేష్ లుక్ ఏమిటో తేటతెల్లం అయ్యింది. కానీ ప్రిన్స్ సిక్స్ ప్యాక్ కూడా రెడీ చేస్తున్నారు అనే వార్తకు ఇటీవల తన జిం ట్రైనీతో మహేష్ పోస్ట్ చేసిన పిక్ బలాన్నిస్తోంది. ఏది ఏమైనా ప్రిన్స్ ఫైనల్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఆ లుక్ ను తాజాగా రిలీజ్ చేసిన ఓ యాడ్ రివీల్ చేసిందా? ప్రిన్స్ ఖాతాలో ‘సాయి సూర్య డెవలపర్స్’ అనే సంస్థ కూడా వచ్చి చేరింది. దీనికి సంబంధించిన యాడ్ ను మహేష్ తన యూ ట్యూబ్ ఖాతా ద్వారా విడుదల చేసారు. యాడ్లకు దర్శకత్వం వహించే యమున కిషోర్, ప్రిన్స్ సరికొత్త యాడ్ ను డైరెక్ట్ చేసారు

 

SOURCE:MIRCHI9.COM

02 Jul, 2018 0 411
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved