టాలీవుడ్ ను వదిలేది లేదు అంటున్న మహేష్ హీరోయిన్
విభాగం: సినిమా వార్తలు
mahesh-is-the-heroine-who-does-not-leave-tollywood_g2d

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ లక్ మహా జోరుమీదుంది. బాలీవుడ్ లో ఆఫర్లు అంతగా రాని టైంలో మహేష్ బాబు హీరోగా చేసిన భరత్ అనే నేను కోసం టాలీవుడ్  లో అడుగుపెట్టింది. ఇందులో సీఎంనే ప్రేమలో పడేసే అమ్మాయిగా కియారా బాగానే మెప్పించింది. భరత్ అనే హిట్ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆమె నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ మూవీ చేసింది. 

లస్ట్ స్టోరీస్ లో కియారా బోల్డ్ నటన అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఆమె ఎంత హాట్ గా కనిపించగలదో అందరికీ అర్ధమైంది. దీంతో ఆమెకు బాలీవుడ్ లో తెగ ఆఫర్లు వస్తున్నాయి. ఇదే టైంలో టాలీవుడ్ లోనూ ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న మూవీలో కియారా హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు భారీ ప్రాజెక్టులు ఆమె ఓకే చేయాల్సి ఉంది. 

బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్లు వచ్చినా కదాని టాలీవుడ్ ను వదిలేది లేదంటోంది కియారా. అటు హిందీ.. ఇటు తెలుగులో సమానంగా సినిమాలు చేసుకొస్తానంటోంది. ఇంతకుముందు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియనా ఒకటి రెండు బాలీవుడ్ ఆఫర్లు రాగానే తెలుగు సినిమాలు చేయనంటూ సూట్ కేస్ సర్దుకుని మకాం మార్చేసింది. కానీ బాలీవుడ్ లో ఆమెను పట్టించుకునే వారు లేకపోయారు. ఈవిషయంలో కియారా మాత్రం ఇలియానా కన్నా తెలివిగానే ఆలోచిస్తోంది. ఇలియానాలా బాలీవుడ్ మోజు తలకెక్కించుకోకుండానే బాగానే జాగ్రత్త పడుతోంది

 

SOURCE:GULTE.COM

17 Jul, 2018 0 367
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved