జాదుపూడి గ్రామంలో జనసేన కార్యకర్తల సమావేశం
విభాగం: రాజకీయ వార్తలు
meeting-of-jansana-workers-in-the-village-of-jhadupudi_g2d

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జాదుపూడి గ్రామంలో జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేకమంది జనసేన పార్టీ లోకి చేరారు. జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీలోకి చేరుతున్నామని వారు తెలియచేసారు. కొత్త వారికి జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తెలియచేయగా వాటికి అనుగుణంగా మా వంతు మేము కృషి చేస్తాం అని తెలిపారు. 

పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల వున్న ప్రేమానురాగాలు మరియు ఆయనకి రాజకీయాల పట్ల వున్న చిత్తశుద్ధికి తాము ఎంతగానో ఆకర్షితులమయ్యామని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్రామ గ్రామాన పార్టీని మరింత బల పరచడానికి కార్యాచరణ రూపొందించారు. పవన్ కళ్యాణ్ గారి పోరాట యాత్ర ఉత్తరాంధ్రలో విజయవంతం కావడంతో మాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని జనసైనికులు తెలిపారు. 

పార్టీని మరింత బలపరచేందుకు జనసైనికులు ఒక్కోక్కరుగా తమ అభిప్రాయాలను, సలహాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఘన స్వాగతం పలికారు

 

SOURCE:JANASENA

11 Jul, 2018 0 359
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved