పవన్ కళ్యాణ్ గారిని కలిసిన మిషన్ ఉద్దానం టీం
విభాగం: రాజకీయ వార్తలు
mission-uddhanam-team-meets-pawan_g2d

జ‌న‌సేన అధినేత ఉద్దానం కిడ్నీ వ్యాధిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన త‌ర్వాత‌, బాధితుల‌కి స‌హాయం చేసేందుకు ఎన్నో స్వ‌చ్చంద సంస్థ‌లు ముందుకి వ‌చ్చాయి. ప్ర‌భుత్వం నుంచి అర‌కొర సౌక‌ర్యాలే అందుతున్న‌ప్ప‌టికీ, మీ కోసం మేమున్నాం అంటూ ఎంతో మంది ముందుకి వ‌చ్చారు.

అలా జ‌న‌సేన అధినేత స్ఫూర్తితో ముందుకి వ‌చ్చిన వారిలో మిష‌న్ ఉద్దానం అమెరికా బృందానిది కీల‌క‌పాత్ర‌. ఉద్దానం ప్రాంతంలోని చాలా గ్రామాల్లో కిడ్నీ వ్యాధి పీడితుల‌కి వీరు ఉచితంగా మందులు అందిస్తున్నారు. మిష‌న్ ఉద్దానం టీం గురించి చెప్పుకోవాల్సిన అస‌లు విష‌యం ఏంటంటే, ఈ బృందంలోని స‌భ్యులు అంతా చిన్నారులే...

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి నోటి నుంచి ఉద్దానం అనే ప్రాంతం ఒక‌టి ఉంద‌ని, అక్క‌డ కిడ్నీ వ్యాధుల‌తో వేలాది మంది చ‌నిపోతున్నార‌ని విన్న ఎన్ఆర్ఐ చిన్నారులు, త‌మ దేశంలో ఇలాంటి ప‌రిస్థితులు ఉన్నాయా అని చ‌లించిపోయారు. స్వ‌దేశంలో కిడ్నీ వ్యాధి పీడితుల్ని ఆదుకునేందుకు త‌మ‌వంతు ఏదైనా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఓ జ‌ట్టుగా ఏర్ప‌డి, త‌మ కిడ్డీ బ్యాంకులు ప‌గుల‌గొట్టేశారు.. ఉద్దానం బాధితుల కోసం త‌మ‌వంతుగా ఒక్కోక్క‌రూ 500 డాల‌ర్ల మేర విరాళం ఇవ్వ‌డంతో పాటు, త‌మ త‌మ ప్రాంతాల్లో విరాళాలు సేక‌రించారు. వ‌య‌సుకి చిన్నారులే అయినా త‌మ పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు..

ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వాలు మీన మేషాలు లెక్కిస్తుంటే, జ‌న‌సేన అధినేత అందించిన స్ఫూర్తితో ఎన్ఆర్ఐ చిన్నారులు తాము సేక‌రించిన విరాళాల‌తో ఉద్దానం రోగుల‌కి మందులు పంపారు. త‌మ‌వంతుగా ఉద్దానం వ్యాధిగ్ర‌స్తుల‌కి కొన్ని స‌దుపాయాలు క‌ల్పించేందుకు కూడా ముందుకి వ‌చ్చారు. ఇప్పుడు స్వ‌యంగా ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించేందుకు ఆ చిన్నారి టీం విశాఖ వ‌చ్చింది.. మ‌లివిడ‌త పోరాట‌యాత్ర‌లో ఉన్న జ‌న‌సేన అధినేత‌ని మిష‌న్ ఉద్దానం అమెరికా బృందం క‌లిసింది.. చిన్నారుల్ని చూపి మిష‌న్ ఉద్దానం బృందం అంటున్నారేంటి అనుకోవ‌ద్దు.. ఆ ఎన్ఆర్ఐ చిచ్చ‌ర‌పిడుగులే మిష‌న్ ఉద్దానం టీం స‌భ్యులు.

ఇంత చిన్న వయస్సులో సామాజిక సేవ చేయాల‌న్న ఆలోచ‌న రావ‌డాన్ని జ‌న‌సేన అధినేత అభినందించారు.. మిష‌న్ ఉద్దానం స‌ర్వీస్‌ని ఓపిక ఉన్న మేర‌కు కొన‌సాగించాల‌ని సూచించారు.. ఉద్దానం కిడ్నీ క్రానిక్ డిసీజ్‌కి శాశ్వత ప‌రిష్కారం చూపేందుకు త‌న‌వంతుగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేస్తున్న‌ట్టు జ‌న‌సేనాని తెలిపారు. గురువారం డాక్ట‌ర్ దుర్గారావు గారితో క‌ల‌సి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ గారిని క‌లిసిన వీరు, శుక్రవారం ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించారు. కిడ్నీ వ్యాధి బారిన ప‌డిన గ్రామాల్లో ప‌ర్య‌టించి, బాధితుల కష్టాలను స్వ‌యంగా చూశారు..

 

SOURCE:JANASENAPARTY.ORG

.

 

30 Jun, 2018 0 394
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved