ఫసక్ మీమ్స్‌.. విజయ్ రూట్లో మోహన్ బాబు
విభాగం: సినిమా వార్తలు
mohan-babu-reacts-on-fassak-memes_g2d

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఈ మధ్య సోషల్ మీడియా జనాలకు బాగా టార్గెట్ అయిపోయారు. ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్‌తో జరిగిన ఇంగ్లిష్ ఇంటర్వ్యూలో ఆయన తాను నటించిన ‘ఎం.ధర్మరాజు ఎంఏ’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఉదహరిస్తూ.. ‘‘డోంట్ కిల్ సో మెనీ టైమ్స్ లైక్ దిస్.. ఓన్లీ వన్స్ ఫసక్’’ అంటూ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయింది. 

దీనిపై కుప్పలు కుప్పలుగా మీమ్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. కొన్ని రోజులుగా ఫసక్ జోక్స్ వైరల్ అవుతున్నాయి. ఐతే ఈ జోకుల విషయంలో మోహన్ బాబు సరదాగా స్పందించారు. తనకు మంచు విష్ణు ఈ ఫసక్ జోక్స్ గురించి చెప్పాడని.. వాటిని తాను ఎంజాయ్ చేశానని చెప్పాడు మోహన్ బాబు.

‘‘ఫసక్ ట్రెండ్ అవుతుందని తెలిసి సంతోషించా. దీని మీద మినిమం 200 స్పూఫ్ వీడియోలు ఉన్నాయని మంచు విష్ణఉ చెప్పాడు. వాటిల కొన్ని చూశా. చాలా సృజనాత్మకంగా.. సరదాగా ఉన్నాయి’’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. తనపై పేలుతున్న జోకుల్ని మోహన్ బాబు ఇలా సరదాగా తీసుకోవడం విశేషమే. ఐతే ఈ విషయంలో విజయ్ దేవరకొండ మంచు ఫ్యామిలీకి స్ఫూర్తిగా నిలిచి ఉండొచ్చు. ‘గీత గోవిందం’ కోసం అతను పాడిన పాట మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడవగా.. అతను స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు. 

ఈ చిత్ర ఆడియో వేడుకలో తనపై వచ్చిన మీమ్స్ అన్నింటినీ స్క్రీన్ మీద చూపించి దాని మీద కామెడీ చేశాడు. ఇంతకుముందు సుశాంత్ సైతం ‘గట్టిగా కొడతా’ అంటూ తనపై వచ్చిన మీమ్ మీద స్పోర్టివ్‌గా స్పందించాడు. సెలబ్రెటీలు ఇలా తమపై ట్రోలింగ్ విషయంలో సరదాగా స్పందించడం మంచి విషయమే.

 

 

SOURCE:GULTE.COM

04 Sep, 2018 0 736
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved