నాగార్జునతో మేనల్లుడి గొడవ
విభాగం: సినిమా వార్తలు
nagarjuna-clash-with-sumanth-on-movie-releases_g2d

అక్కినేని నాగార్జనకు.. ఆయన మేనల్లుడు సుమంత్‌కు సరైన సంబంధాలు లేవన్న ప్రచారం ఒకటి ఇండస్ట్రీలో ఉంది. ఈ విషయాన్ని ఇద్దరూ ఖండిస్తుంటారు కానీ.. ఒకప్పటిలా ఇప్పుడు ఇద్దరూ సన్నిహితంగా కనిపించట్లేదన్నది వాస్తవం. సినిమాల విషయంలోనూ ఎవరి దారి వారిదన్నట్లు ఉంటున్నారు. సుమంత్‌ సినిమాలు రిలీజైనపుడు నాగ్ పెద్దగా స్పందిస్తున్నది లేదు. 

సుమంత్‌కు చాన్నాళ్ల తర్వాత ‘మళ్ళీరావా’ రూపంలో ఓ విజయం దక్కితే అప్పుడు ఏదో మొక్కుబడిగా ఒక ట్వీట్ చేశాడు నాగ్. ఈ విషయం అలా ఉంచితే.. త్వరలోనే మామ-మేనల్లుడు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నానితో కలిసి నాగార్జున నటించిన కొత్త సినిమా ‘దేవదాస్’ చిత్రాన్ని సెప్టెంబరు 27న రిలీజ్ చేయబోతున్నట్లు చాలా రోజుల కిందటే ప్రకటించారు.

ఈ విషయం తెలిసి కూడా సుమంత్ తన కొత్త సినిమా ‘ఇదం జగత్’ను దానికి పోటీగా నిలబెట్టడం గమనార్హం. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఇదం జగత్’ టీజర్ కొన్ని రోజుల కిందటే లాంచ్ అయి మంచి స్పందనే రాబట్టుకుంది. ఆసక్తికరమైన థ్రిల్లర్ చూడబోతున్న భావన కలిగించిందా టీజర్. ఐతే ఈ సినిమా హాలీవుడ్ మూవీ ‘న్యూస్ క్రాలర్’కు ఫ్రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంగతెలా ఉన్నప్పటికీ.. నాగార్జునకు పోటీగా సుమంత్ తన చిత్రాన్ని నిలబెట్టడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. 

వినాయక చవితికి భార్యాభర్తలైన నాగచైతన్య, సమంతల సినిమాలు పోటీ పడుతున్న మాట వాస్తవం. కానీ అది అనివార్య పరిస్థితుల్లో జరిగింది. కానీ ఇక్కడ మాత్రం సుమంత్ వేరే అవకాశమున్నప్పటికీ మావయ్యతో పోటీకి సై అంటున్నాడు. మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘దేవదాస్’కు పోటీగా తన చిత్రాన్ని నిలపడం కచ్చితంగా సాహసమే. మరి సుమంత్ ఉద్దేశమేంటో? 

 

 

SOURCE:GULTE.COM

01 Sep, 2018 0 355
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved