నిక్కరు.. చొక్కా వేసుకున్న పవన్
విభాగం: సినిమా వార్తలు
nickaru-..-pawan-wearing-a-shirt_g2d

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంటును ప్రధానంగా రాజకీయాల కోసమే ఉపయోగిస్తుంటాడు. వ్యక్తిగత విశేషాలు.. సినిమాల సంగతుల గురించి ఇందులో పంచుకోవడం చాలా అరుదు. ఐతే ఈ రోజు పవన్ నోస్టాల్జిక్ గా అనిపించే వ్యక్తిగత ఫొటో ఒకటి ట్విట్టర్ లో పంచుకుని ఆశ్చర్యపరిచాడు. అందులో పవన్ అన్నయ్యలు చిరంజీవి.. నాగబాబులతో పాటు అతడి ఇద్దరు సోదరీమణులు కూడా ఉండటం విశేషం. అది ఈనాటి ఫొటో కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల కిందటిది. పవన్ అప్పటికి ఏడో క్లాసులో ఉన్నాడు. నెల్లూరులో ఏడో తరగతి చదువుకుంటున్నపుడు తీసిన ఫొటో అదని పవన్ వెల్లడించాడు. చిరు నలుపు చొక్కాలో.. నాగబాబు తెలుపు చొక్కాలో మెరిసిపోతున్నారందులో. చిరు అప్పటికే హీరోగా రాణిస్తున్నాడు అప్పటికి.

నిక్కరు.. చొక్కా వేసుకున్న పవన్ అందులో చాలా డల్లుగా కనిపిస్తున్నాడు. అందుకు కారణం లేకపోలేదు. అప్పటికి దీర్ఘ కాలిక శ్వాస కోస వ్యాధి నుంచి కోలుకున్నాడట పవన్. ఈ ఫొటో మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అసలెప్పుడూ వ్యక్తిగత విశేషాలు ట్విట్టర్ లో పంచుకోని పవన్.. ఇలా తన చిన్ననాటి ఫొటోను షేర్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్నేళ్ల కిందట తన అన్నయ్యకు దూరం దూరం జరిగిన పవన్.. ఈ మధ్య మళ్లీ చిరుకు బాగా దగ్గరవుతున్నాడు. అన్నయ్య గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా చిరుకు చేరువ అవుతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి మెగా ఫ్యామిలీ అంతా పవన్ వెనుక నడిచేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు చూస్తుంటే. మెగా అభిమానుల్లో కూడా చీలకలేమీ లేకుండా అందరూ ఒకేతాటిపై నడవడానికి అందరూ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా ఉంది ఈ మధ్య వ్యవహారాలు చూస్తుంటే

 

SOURCE:TUPAKI.COM

06 Jul, 2018 0 298
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved