‘అరవింద సమేత’ అభిమానులు నిరాశ చెందారు
విభాగం: సినిమా వార్తలు
no-second-teaser-from-aravinda-sametha_g2d

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజైన ‘అరవింద సమేత’ టీజర్ చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, మాస్ ప్రేక్షకులు మురిసిపోయారు. ఈసారి తారక్ నుంచి సూపర్ మాస్ ట్రీట్ ఉంటుందని ఈ టీజర్ సంకేతాలిచ్చింది. ఐతే ఈ టీజర్ చూసి త్రివిక్రమ్ అభిమానులు మాత్రం ఒకింత నిరాశకు గురయ్యారు. 

టీజర్లో కొత్తదనం లేదని.. త్రివిక్రమ్ మార్కు మిస్సయిందని అసంతృప్త గళాలు వినిపించాయి. ఇది అసలు త్రివిక్రమ్ సినిమానేనా అన్నారు కూడా. ఈ ఫీడ్ బ్యాక్ చిత్ర బృందం వరకు చేరడంతో త్రివిక్రమ్ మార్కు ఎంటర్టైన్మెంట్‌తో రెండో టీజర్ వదులుతారని ప్రచారం జరుగుతోంది కొన్ని రోజులుగా. ఐతే అలాంటిదేమీ లేదని క్లారిటీ వచ్చేసింది.

‘అరవింద సమేత’కు రెండో టీజర్ లాంటిదేమీ ఉండదని జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ పీఆర్వో మహేష్ కోనేరు స్పష్టం చేశాడు. చిత్ర బృందానికి అలాంటి ఉద్దేశమేమీ లేదని.. దీనికి సంబంధించిన వార్తలన్నీ అబద్ధమని అతనన్నాడు. ఇక నేరుగా థియేట్రికల్ ట్రైలరే రిలీజ్ చేస్తారని.. అందుకు ముహూర్తం ఎప్పుడన్నది త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ వెల్లడిస్తుందని అతను చెప్పాడు. దీంతో రెండో టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు నిరాశ చెందారు. 

ఐతే టీజర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను బట్టి ట్రైలర్లో త్రివిక్రమ్ మార్కు క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటారనడంలో సందేహం లేదు. సెప్టెంబరు ద్వితీయార్ధంలో ట్రైలర్ లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది.

 

 

SOURCE:GULTE.COM

27 Aug, 2018 0 335
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved