బలి దానాలు వద్దు,హోదా దక్కే వరకూ పోరాడదాం - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
no-suicides-for-status-lets-fight-until-we-get-status-says-pawan_g2d

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం జిల్లా కాగిత గ్రామంలో దొడ్డి త్రినాథ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని తెలియగానే మనసు వికలమైంది. హృదయాన్ని కలచి వేసిన త్రినాథ్ బలవన్మరణం అతన్ని కన్నవారికి ఎంతటి శోకాన్ని మిగులుస్తుందో అర్థం చేసుకోగలను.

ప్రాణ త్యాగం చేసిన త్రినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలి. కడుపు కోతను దిగమింగుకొనే ధైర్యాన్ని కన్నవారికి భగవంతుడు ఇవ్వాలి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాన మంత్రి పార్లమెంట్ కు ఇచ్చిన హామీని సాధించుకోవడంలో పాలకులు విఫలమయ్యారు. హోదా సాధనలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో... ముఖ్యంగా యువతలో అసహనాన్ని తీసుకువస్తుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో ముని కోటి, ఇప్పుడు విశాఖ జిల్లాలో త్రినాథ్ ప్రాణ త్యాగాలు చేశారు. యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఎన్ని మాటలు మార్చినా, సాధనలో విఫలమైనా మనందరం బలంగా ప్రజల ఆకాంక్షను వినిపిద్దాం. దయ చేసి ఎవరూ బలి దానాలకు పాల్పడవద్దు. ఆంధ్ర ప్రదేశ్ కు హోదా దక్కే వరకూ పోరాడదాం అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

01 Sep, 2018 0 365
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved