మరోసారి బన్నీ,పూరి జగన్నాధ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా
విభాగం: సినిమా వార్తలు
once-again,-bunny-and-puri-jagannadh-will-be-repeat_g2d

పూరి జగన్నాధ్-బన్నీ.. దేశముదురు. ఇద్దరు అమ్మాయిలతో... ఫలితం ఎలా వున్నా ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ఎంటర్ టైన్మెంట్ కు ఢోకా వుండదు. అయితే రాను రాను పూరి జగన్నాధ్ వెనుకబడ్డాడు. ఇప్పుడు సరైన ప్రాజెక్ట్ కోసం డెస్పరేట్ గా చూస్తున్నాడు. 

అయితే బన్నీ-పూరి జగన్నాధ్ కాంబినేషన్ మళ్లీ మరోసారి పాజిబుల్ అయ్యే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పూరి ఎక్కడ ఫెయిల్యూర్? కథ దగ్గర అంతేకానీ మేకింగ్ దగ్గర కాదు. వేరే వాళ్లది సరైన కథ దొరికితే హిట్ కొడతాడని టెంపర్ సినిమా రుజువు చేసింది. ఆ తరువాత మళ్లీ పూరికి హిట్ లు లేవు

అందుకే అటు బన్నీ, ఇటు పూరి కూడా సరైన కథ కోసం చూస్తున్నారట. వేరే వాళ్ల కథ సరైనది దొరికితే కలిసి చేద్దామనే ఆలోచన బన్నీలో వుందని వినిపిస్తోంది. పూరికి సమస్యలేదు. పిలిస్తేచాలు వెళ్లి వాలిపోవడం గ్యారంటీ. అయితే ఇటీవల సరైన కథ వుంటే చాలు డైరక్షన్ చాన్స్ అడిగేస్తున్నారు.

అందువల్ల డైరక్షన్ చాన్స్ అడగకుండా సూపర్ కథ ఇచ్చేవాళ్లు కావాలి. అలాంటి వాళ్లు, అలాంటి కథ దొరికితే ఈ కాంబినేషన్ రెడీ అవుతుంది

 

SOURCE:GREATANDHRA.COM

26 Jul, 2018 0 347
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved