ముందు సెక్రటరియేట్ ఇప్పుడు ఉస్మానియా అసలు ఏమి జరుగుతోంది
విభాగం: జనరల్
onceformersecretariatandnowitsosmaniawhatshappening_g2d

పది రోజుల క్రితం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వర్షపు నీటితో మునిగిపోయింది.  హాస్పిటల్ లో ఉన్న రోగులు ఆ వర్షపు నీటిలో ఎంతో ఇబ్బంది పడిన వీడియోలు సోషల్ మీడియాలో అందరూ చూడటం మీకు తెలుసు. వర్షపు నీటితో మునిగిపోయిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ను చూసిన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి . దీనికి తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ బుధవారం ఉస్మానియా జనరల్  హాస్పిటల్ మూసివేయాలి అని ఆదేశించింది. 

ఆసుపత్రి సూపరిండెంట్  కు రాసిన లేఖలో భవనంలో ఉన్న రోగులను ఖాళీ చేసి పక్కనే ఉన్న ఇతర వార్డులలోకి మార్చాలని, భవనంలో ఎటువంటి కార్యకలాపాలు జరపకూడదు అని ఒకవేళ ఏవైనా ఏవైనా కార్యకలాపాలు సాగినచో తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. 

తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ మాట్లాడుతూ భవనం బాగా పాతది కావడంతో శిథిలావస్థలో ఉంది మరియు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అందువలన రోగులు ,వైద్యుల కార్యాలయాలను ఇప్పటికే తరలించాము . ఈ ఆసుపత్రిని కొనసాగించే ప్రక్రియకు మేము చేయలేము అని తెలియజేశారు . 

హాస్పిటల్ ఇన్ ఛార్జ్ మాట్లాడుతూ ఇప్పటికే ఆరు అవార్డులు మరియు రెండు ఆపరేషన్ థియేటర్లు పక్కనే ఉన్న కొత్త భవనాల లోకి  మార్చబడ్డాయి అని , ప్రమాదాలు నివారించడానికి మరియు రోగుల ప్రయోజనం కోసం ఇలా చేసాము అని తెలియజేశారు. 

ఇదే అంశంపై ఇంతకుముందు హాస్పిటల్ కూల్చివేసి కొత్త భవనం కట్టాలి అని కొంతమంది డాక్టర్లు ధర్నా చేయడం తెలిసిందే. 
పురాతన భవనం అవడంవల్ల వర్షం పడడం వల్ల అనేక వార్డులు నీటితో మునిగిపోవడం , ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో శతాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనానికి తెలంగాణ ప్రభుత్వం సీల్ వేసింది

23 Jul, 2020 0 58
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved