15 సీట్లూ ఇస్తే తాగు నీరు కూడా ఇవ్వ‌లేక‌పోయారు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawan-abuses-tdp-for-not-providing-drinking-water_g2d

ప‌క్క‌నే గోదావరి ప్ర‌వ‌హిస్తున్నా తాగు నీటి కోసం ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డ‌టం చాలా బాధ‌ క‌లిగిస్తోందని జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు.

విచ్చ‌లవిడిగా అక్ర‌మ ఆక్వా సాగుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌డంతో భూగ‌ర్భ‌ జ‌లాలు, మంచి నీటి కాలువ‌లు క‌లుషిత‌మై ప్ర‌జ‌లు తాగు నీటికి ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. జనసేన పోరాట‌యాత్ర‌లో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆకివీడు మండ‌లం చిన‌కాప‌వ‌రం గ్రామంలోని పరిమెళ్ళ ప్రాజెక్ట్ ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి 15కి 15 సీట్లు ఇచ్చిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కుల నిర్ల‌క్ష్యానికి గురైందన్నారు. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం తాగు నీరు కూడ అందించ‌లేక‌పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌జాప్ర‌తినిధుల అవినీతి, నిర్ల‌క్ష్యం కార‌ణంగా 2005 లో శంకుస్థాప‌న చేసిన ప‌రిమెళ్ల ప్రాజెక్ట్ నేటికి ప‌ట్టా లెక్క‌లేద‌ని, రూ. 18 కోట్లు ఖ‌ర్చ‌యినా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చుక్క నీరు మాత్రం అంద‌లేద‌ని ఆక్షేపించారు. ఈ ప్రాజెక్ట్ ను స‌రిగా ప‌ట్టాలు ఎక్కించి ఉంటే గణపవరం, ఆకివీడు, కాళ్ళ మండ‌లాల్లోని సుమారు రెండు లక్షలమంది  ప్రజలకు రక్షితమైన మంచినీరు లభించి ఉండేదని అన్నారు. ఉండి నియోజ‌క‌వ‌ర్గ తాగు నీటి స‌మ‌స్య‌పై జ‌న‌సేన పోరాడుతుంద‌ని, ఓట్లు వేసినా వేయ‌క‌పోయినా అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

 

SOURCE:JANASENA.ORG

13 Aug, 2018 0 356
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved