జనసేన మేనిఫెస్టో అంశాలకు విస్తృత ప్రచారం కల్పించండి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
విభాగం: రాజకీయ వార్తలు
pawan-asks-to-do-maximum-campaign-for-janasena-manifesto_g2d

ప్రజల  మన్నలను పొందుతున్న జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (ప్యాక్) ను ఆదేశించారు.

పన్నెండు అంశాలతో కూడిన పార్టీ విజన్ డాక్యుమెంట్ ఈ నెల 14 వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉచిత గ్యాస్ సిలెండర్, రేషన్ కు బదులు 2500 నుంచి 3500 రూపాయల నగదు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి పథకాల పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికీ తెలియవలసిన అవసరం ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచి శాసనసభ ఎన్నికల వరకు ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ప్యాక్ బుధవారం సమావేశమై ఈ అంశంపై కూలంకషంగా, సుదీర్ఘంగా చర్చించింది. ప్రచారం కోసం ఎటువంటి మాధ్యమాలను ఉపయోగించాలి, ఎటువంటి వ్యూహం అనుసరించాలి అన్న అంశాలపై ప్యాక్ చర్చించింది. దీనిపై ఒక పథకం రూపొందించింది.దీనిపై  అందుబాటులో ఉన్న పార్టీ జిల్లా కమిటీలతో చర్చించాలని తీర్మానించింది. జిల్లా కమిటీల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమోదం కోసం పార్టీ అధ్యక్షునికి సమర్పించాలని ప్యాక్ తీర్మానించింది. మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ప్రచారంలో పార్టీ శ్రేణులను కుడా  భాగస్వామ్యుల్ని చేయాలని ప్యాక్ నిర్ణయించింది. 

 

 

SOURCE:JANASENA.ORG

23 Aug, 2018 0 344
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved