తెలంగాణ ఎన్నికలపై దృష్టిపెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-concentrates-on-telangana-elections_g2d

తెలంగాణ శాసనసభకు జరగనున్న ముందస్తు ఎన్నికలపై జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) తో సుదీర్ఘంగా చర్చించారు.

హైదరాబాద్ లోని మాదాపూర్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఈ సమావేశం జరిగింది. తెలంగాణ ఎన్నికలపై అనుసరించ‌వ‌ల‌సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. సి.పి.ఎం తెలంగాణ శాఖ నేతలు, ఆ పార్టీ కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభద్రంతో జరిపిన చర్చల వివరాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్యాక్ సభ్యులు వివరించారు.

ఆ చర్చలు సామరస్యంగా, ఫలవంతంగా జరగడంతో తదుపరి చర్చలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరగాలని ప్యాక్ సభ్యులు కోరడంతో అందుకు శ్రీ పవన్  కళ్యాణ్ గారు అంగీకరించారు. సి.పి.ఎం నేతలను తదుపరి చర్చలకు ఆహ్వానించవలసిందిగా రాజకీయవ్యవహారాల కమిటీకి సూచించారు. మంగళ లేదా బుధవారంనాడు సి.పి.ఎం నేతలతో సమావేశం జరిగే అవకాశం వుంది.

 

 

 

SOURCE:JANASENA.ORG

   

09 Sep, 2018 0 347
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved