కరుణానిధి చిరంతనంగా మన మధ్య ఉండాలి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawan-get-well-soon-message-for-karunanidhi_g2d

 ద్రవిడ ఉద్యమ యోధుడు, డి.ఎం.కె.అధినేత, మాన్యశ్రీ కరుణానిధి సంపూర్ణంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం జాతికి తెలిసినదే. తమిళనాడులో జరిగిన అనేక ఉద్యమాలలో ప్రజల పక్షాన నిలిచిన యోధుడు శ్రీ కరుణానిధి. తాడిత,పీడిత ప్రజల పక్షపాతి ఆయన. వెనుకబడిన కులాల వారి అభివృద్ధికి ఆయన నిరంతరం పాటుపడ్డారు. రచయితగా ఆయన కలైంగర్ గా కీర్తింపబడ్డారు. ఈ విషయాలు నేను చదివి తెలుసుకున్నవి కావు. నేను కొన్నాళ్లపాటు చెన్నైలో ఉండడంవల్ల ఆయన గురించి ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకున్నవి.

రచయితగా,రాజకీయ దురంధునిగా తమిళనాడుతోపాటు ఆయన మన దేశానికి చేసిన సేవలకు మనం ఆయనకు ఎంతో రుణపడి వున్నాము. కరుణానిధి వంటి యోధులు మన మధ్య ఉంటే చాలు వారి స్ఫూర్తి నలు దిశలా వ్యాపిస్తునే ఉంటుంది. ఇటువంటి మహానుభావుడు చిరంతనంగా మన జన్మభూమి పై ఉండాలని, ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నా తరపున, జనసేన శ్రేణుల తరపున కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

 

SOURCE:JANASENA.ORG

04 Aug, 2018 0 297
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved