తుఫాను బాధితుల కష్టాలు చూసి చలించిపోయిన జనసేనాని
విభాగం: రాజకీయ వార్తలు
pawan-gets-emotional-seeing-titli-victims_g2d

  ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో సంభవించిన తిత్లీ తుఫాను కారణంగా అక్కడ ప్రజలు మరీ ముఖ్యంగా శ్రీకాకుళం వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాలలో కరెంటు లేక అంధకారంలో ప్రజలు జీవిస్తున్నారు.

సరైన ఆహారం లేక ఆకలితో తల్లడిల్లుతున్న అక్కడ వాసులకు ఇప్పటికే జనసైనికులు అండగా నిలువగా తాజాగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాపోరాటయాత్ర కు విరామం ప్రకటించి శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. ఈరోజు టెక్కలి సమీపంలో గల గ్రామాల్లో పర్యటించిన జనసేనాని బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు. స్వయంగా ప్రతీ ఒక్కరి కష్టాలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు పుస్తకంలో వారి సమస్యలను పొందుపరుచుకున్నారు.

వృద్ధుల కష్టాలు చూసి కన్నీటి పర్యంతమైన జనసేనాని వారి కన్నీళ్లకు అండగా నిలుస్తూ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారి వెంట జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు మరియు స్థానిక నాయకులు గేదెల శ్రీనుబాబు గారు పాల్గొన్నారు.  

 

 

 

SOURCE:JANASENA.ORG

18 Oct, 2018 0 308
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved