ఈ కుట్ర లో పవన్ కీలక పాత్ర
విభాగం: రాజకీయ వార్తలు
pawan-has-played-a-crucial-role-in-this-conspiracy_g2d

ఓ పక్కన పోరాట యాత్రలో బిజీగా జనసేన అధినేత ఒక్కసారిగా అమరావతిలో ప్రత్యక్షం కావడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా? అంటే అవుననే సమాధానం టిడిపి వర్గీయుల నుండి లభిస్తోంది. దీని వెనుక చెప్తోన్న అంశం కూడా లాజికల్ గానే ఉండడంతో, ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. అసలు విషయానికి వస్తే… సోమవారం నుండి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి గ్రామాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. దాదాపుగా 3400 కోట్ల రుణం నిమిత్తం ఈ పర్యటన జరుగుతోంది. గత మూడు, నాలుగేళ్ళుగా అనేక మార్లు ఇప్పటికే వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు అమరావతి వచ్చి వెళ్లారు. దీంతో ఈ సారి పర్యటన తర్వాత నిధులు మంజూరు అవుతాయనే నమ్మకం అధికారులలో వ్యక్తమయ్యింది. దీనిని ఎలాగైనా అడ్డుకోవడానికే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ నిధులు మంజూరు కాకుండా చూసే క్రమంలో ముందుగా ప్రజలను, అభిమానులను రెచ్చగొట్టేందుకు ఉన్నట్లుండి పవన్ అమరావతి పర్యటన చేసారనేది టిడిపి వర్గీయుల వాదన. దీని వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉందని, ఆ కుట్రలో పవన్ భాగస్వామ్యుడు అయ్యాడనే దానిపై నిజానిజాలు ఎలా ఉన్నా, పవన్ చేసిన రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు, ప్రవర్తించిన విధానం మాత్రం ఈ ఆరోపణలకు బలం చేకూరేలా చేసింది. రాజకీయాలు ఎవరిని ఎలా మార్చాస్తాయో తెలియదు అన్న దానికి నిదర్శనమే ఈ వార్తలు. ఈ కుట్ర నిజమో కాదో ఇప్పుడే చెప్పలేం గానీ, ప్రజాసేవ పేరుతో రాజకీయ నాయకులు ఎంత నీచానికైనా దిగజారుతారు అన్నది మాత్రం వాస్తవం. మరి ఈ ఆరోపణలపై జనసేన అధినేత మరియు జనసేన వర్గీయులు ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి

 

SOURCE:MIRCHI9.COM

24 Jul, 2018 0 282
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved