జనసైనికుల క్షేమం నాకు ప్రథమ బాధ్యత - శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
విభాగం: రాజకీయ వార్తలు
pawan-instructs-janasainiks-to-stay-safe-in-tomorrows-kavathu_g2d

  రేపు ధవళేశ్వరం బ్యారేజీ మీద జరిగే కవాతుకు వచ్చే జనసైనికులు జాగ్రత్త వహించాలని జనసేనాని కోరారు. 

"కవాతులో పాల్గొనబోతున్న జనసైనికులందరికి నా విన్నపం, అభ్యర్ధన : మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలి, ఒక క్రమశిక్షణ తో ముందుకు వెళదాం, కలిసి నడుద్దాం , ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా అప్రమత్తముగా ఉండండి. జన సైనికులకు ముఖ్యంగా బైకుల్లో వచ్చే యువత వేగంగా రాకండి, ఉత్సాహాన్ని కవాతులో చూపించండి. బైక్ ఆక్సిలేటర్ సౌండ్లతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఇంటి నుంచి జాతీయ స్ఫూర్తి తో కవాతుకు రండి,మళ్ళీ  క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీ క్షేమం నాకు ప్రథమ భాద్యత. బైకుల్లో స్పీడ్ వెళ్ళేటపుడు మీ తల్లితండ్రులుని, నన్ను గుర్తు పెట్టుకోండి, నిదానంగా రండి"..అని పవన్ కళ్యాణ్ గారు జనసైనికులను కోరారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

14 Oct, 2018 0 390
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved