శ్రీ హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరం - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-condolences-to-hari-krishna_g2d

మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారు అనుకొనేలోగా విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలి.  సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివి. శ్రీ హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి ఆయన  కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా తరపున, జనసేన శ్రేణుల తరపున శ్రీ హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేసారు.

జనసేన అధికారిక కార్యక్రమాలు రద్దు :

ఈ రోజు జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకులు చేరికలు, గిడుగు రామమూర్తి జయంతి వేడుకల నిర్వహణ ఉన్నాయి. వాటిని సహృదయులు శ్రీ హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా రద్దు చేశారు.

 

 

SOURCE:JANASENA.ORG

30 Aug, 2018 0 335
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved