RGV కి తినిపించిన పవన్ కళ్యాణ్ అభిమానులు
విభాగం: సినిమా వార్తలు
pawan-kalyan-fans-fed-to-rgv_g2d

తెలుగు చిత్రపరిశ్రమ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యుద్ధం ప్రకటించారు. దేశంలో ఏదైనా కాంట్రవర్సి ఉంటె అది నా పేరు మీద ఉండాలి అన్నంత బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ బ్రాండ్ ఇమేజ్ ను డబ్బులుగా మార్చుకోవడం లో RGV ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ కాంట్రవర్సి న్యూస్ ను సినిమాగా మార్చి మరోసారి తన తెలివిని ప్రదర్శిస్తూ అభిమానులతో చీవాట్లు తింటూ ఉంటాడు.
      ఇంతకు ముందు “లక్ష్మీస్ ఎన్టీఆర్” NTR జీవితం అంటూ చూపిస్తూ NTR అభిమానులతో అవే చీవాట్లు తిన్నాడు. తరువాత “అమ్మరాజ్యంలో కడప బిడ్డలు” అంటూ ఆంధ్ర ప్రదేశ్ CM జగన్ గురుంచి సినిమాను తీసి YSR పార్టీ కార్యకర్తలతో చీవాట్లు తిన్నాడు. ఇటీవల “పవర్ స్టార్”అనే సినిమా తెరకెక్కించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని హీరోగా పెట్టి ఈ సినిమా తీయడం దీనిలో ఒక సాంగ్ రిలీజ్ చేయడం, ఆ సాంగ్ కి YOUTUBE లో ఎన్ని లైక్ లు వచ్చాయో అన్ని డిస్ లైక్ లు కూడా వచ్చాయి. వీటిని చూసి పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా RGV పై విరుచుకు పడుతున్నారు.
      పవన్ అభిమానులు అక్కడితో ఆగకుండా రామ్ గోపాల్ వర్మ కి పోటీగా “పరాన్న జీవి” అనే తెరకెక్కించే పనిలో ఉన్నారు.అంతే కాకుండా పరాన్న జీవి సినిమా నుండి, పరాన్న జీవి... జీవి నిర్జీవి ఆర్జీవి ... అంటూ సాగే ఒక పాటను RGV ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసారు. అలాగే పరాన్నజీవి సినిమాకి దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ పరాన్నజీవి కి ట్యాగ్ లైన్ గా “పెళ్ళాం వదిలేసిన ఒక దర్శకుడి కథ” అని పెట్టాను. అలాగే ఒక ముసలి వాడు గురుంచి తీస్తున్న యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించినట్లు తెలియజేసారు.ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన చిత్రం అని తెలియజేసారు.అలాగే RGA పై “రోజూ గిల్లే వాడు” అనే టైటిల్ తో మరో సినిమా కూడా రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి.  
      ఇక డేరా బాబా పేరుతో RGV పై షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తూ మరో సినిమా కూడా వస్తుంది. ఇలా ఇన్నాళ్ళు పక్క జీవి పై ఆధారపడి బతికిన పరాన్న జీవి పై పవన్ అభిమానులు విరుచుకు పడుతున్నారు.

22 Jul, 2020 0 254
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved