పవన్ ఆ చానెల్ ను కొన్నారా?
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-introduces-his-news-channel_g2d

కొద్ది రోజుల క్రితం కొన్ని తెలుగు న్యూస్ చానెళ్లపై జనసేన అధినేత - సినీ నటుడు పవన్ కల్యాణ్ తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై కొంతకాలం నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని....ఆ చానెళ్ల వైఖరిని పవన్ ఎండగట్టారు. ఆ తర్వాత పవన్ కు సంబంధించిన కార్యక్రమాలపై సదరు చానెళ్లు పెద్దగా శ్రద్ధ వహించలేదు. అంతకుముందు నుంచి సొంతగా ఓ చానెల్ ను ప్రారంభించాలని పవన్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ న్యూస్ చానెల్ ను పవన్ కొనబోతున్నారన్న వార్త కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ ....తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన ఐటీ వింగ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన పవన్ అక్కడకు వచ్చిన 99 టీవీ చానెల్ విలేకరి దగ్గర మైక్ తీసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మైక్ ను ఎగాదిగా చూసిన పవన్.....``ఓహ్ మనదే``అని అనడం చర్చనీయాంశమైంది.

తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలతో 99టీవీ చానెల్ ను పవన్ ఆయన సన్నిహితులు కొన్నట్లుగా ...సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఆ చానెల్ మైక్ ను చూసిన పవన్...`ఓహ్ మనదే` అని అంటూ చిరునవ్వు చిందించడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది. వాస్తవానికి - 99 టీవీ చానెల్ ను తమ్మారెడ్డి స్థాపించారు. ఆయన చిరంజీవికి - మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అదీగాక జనసేనలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్..ఓ చానెల్ ను కొన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా పవన్ వ్యాఖ్యలతో చంద్రశేఖర్ పవన్ కొన్నది ఈ చానెల్ అని చాలా మంది కన్ ఫమ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటికీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

 

SOURCE:TUPAKI.COM

18 Jul, 2018 0 370
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved