ముఖ్యమంత్రి గారు పోలవరం నిర్వాసితులకు బాండ్స్ ఎందుకు విడుదల చెయ్యట్లేదు - జనసేనాని..
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-questions-babu-over-polavaram_g2d

పోరాటయాత్రలో భాగంగా జంగారెడ్డిగూడెంలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని ప్రసంగం :

* ఇక్కడికి వచ్చిన జనసైనికులకు, అన్నదమ్ములకు, ఆడపడుచులకు, పెద్దలకు జనసేన పార్టీ తరపున ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా నమస్కారాలు..

* ప్రజాపోరాటయాత్ర తిరుపతి నుండి ప్రారంభించాం..జగన్ గారిలా ముఖ్యమంత్రి అయిపోదామని నేను రాలేదు...యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, మహిళలకు భద్రత ఉండాలి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను..

* ఇన్ని ప్రభుత్వాలు ఏర్పడినా బుట్టాయగూడెంలో ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మించలేకపోయారు. 2009లో అప్పటి ఎంపీ హడావిడిగా రాష్ట్రపతి పాలన ఒక్కరోజు ముందు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏర్పడిన తెలుగుదేశం హయాంలో కూడా బుట్టాయగూడెంలో పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మించలేకపోయారు.

* మొన్న ఆ మధ్యన నా సెక్యూరిటీ వారికి జంగారెడ్డిగూడెంలో యాక్సిడెంట్ అయితే ఇక్కడ మంచి హాస్పిటల్ కోసం వెతికితే ఇక్కడ వుండవు, ఏలూరు వెళ్ళాలి లేక విజయవాడ వెళ్ళాలి అని చెప్పారు. ఏలూరు వెళ్తే జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు మధ్య రోడ్లు మరీ అద్వానంగా వున్నాయి.

* ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారు 14000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం అని చెప్తున్నారు. ఒక్కసారి లోకేష్ గారు బుట్టాయగూడెం వచ్చి ఇక్కడ రోడ్లను చూడాలి. నిన్న నేను తెల్లారి ఒక గుడికి వెళ్తే 14 కిలోమీటర్లకు ఏ ట్రాఫిక్ లేకుండా 40 నిమిషాలు పట్టింది. 

* ముఖ్యమంత్రి గారిని సవ్యమైన పాలన అందించండి అని నేను అడిగాను...మా ప్రభుత్వానికి మీరు ఇంత అండగా నిలబడ్డారు, మేము మీకు ఏం చేయగలమని ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. దానికి బదులుగా నేను మా యువతకు ఉద్యోగాలు కల్పించండి, కులాలకు..మతాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించండి, నాకు ఏమీ వద్దని చెప్పాను.

* మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను..బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను..అందరూ భయపడుతున్న సమయంలో, రాష్ట్రం విడిపోయిన సమయంలో నేను రాజకీయాల్లోకి వచ్చాను.

* పక్కనే వున్న తెలంగాణాలో రోడ్లు బాగానే వున్నాయి, మన జంగారెడ్డిగూడెంలో మాత్రం అద్వానంగా వున్నాయి..

* ఎవరైతే పోలవరం కోసం త్యాగం చేశారో వారికి సరైన సహాయం అందించలేకపోయారు. లక్షల కుటుంబాల పోలవరం వల్లన అద్వాన స్థితిలోకి వెళ్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. 

* లక్షల మంది ప్రజలు జాతీయ హోదా ప్రాజెక్టు కోసం దెబ్బతింటున్నప్పుడు మీకు అండగా ఉండాల్సిన బాధ్యత మాకు వుంది, జనసేన మీకు అండగా ఉంటుంది. 

* ముఖ్యమంత్రి గారు!!!అమరావతి రాజధానిలో రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు అమరావతి బాండ్స్ విడుదల చేశారు..మరి పోలవరం నిర్వాసితులకు బాండ్స్ ఎందుకు విడుదల చెయ్యట్లేదు.

* పోలవరం నిర్వాసితులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. జాతి ప్రయోజనాల కోసం త్యాగం చేశారు కాబట్టి, గతంలో నిర్వాసితుల జీవితం ఎలా ఉందో దాని కంటే మెరుగైన జీవితాన్ని అందించేలా జనసేన మ్యానిఫెస్టోలో తెలియజేస్తాం..బాండ్స్ రూపంలో గాని, బాకీ ఉన్నట్టు గాని పత్రాలు అందిస్తాం..మీ పండగలకు, సంస్కృతులకు అండగా ఉండేలా జనసేన మ్యానిఫెస్టో ఉండబోతుంది.

* నాకు ముఖ్యమంత్రి గారి అనుభవం మీద అపారమైన నమ్మకంతో మద్దతు ఇచ్ఛా..అనుభవం వున్న వ్యక్తి, 9 సంవత్సరాలు ముఖ్యంమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో వున్నారని..వాళ్ళ యువత ఓట్లు చీలిపోతాయి అన్నా, మాకు మద్దతు తెలపండి అన్నారని ఆరోజున తెలుగుదేశానికి మద్దతు తెలిపాను.

* తెలుగుదేశానికి మద్దతు తెలిపితేనే బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం మరియు ఇతర మండలాల నుండి దాదాపు 3 లక్షల ఓట్లు మాగంటి బాబు గారికి పడ్డాయి, లేకపోతే వారు ఎంపీ గా గెలిచేవారు కాదు.

* మన జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ పేకాట క్లబ్ గా..జూదానికి అడ్డాగా మారింది అని మన యువత నాతో చెప్తున్నారు. టౌన్ హాల్ లో ప్రజలకు ఉపయోగపడే వాటి మీద చర్చించాలి, అలాంటి టౌన్ హాల్ జూదానికి అడ్డాగా మారింది అంటే నాకు చాలా బాధ కలిగింది. 
 
* ప్రజలకు అండగా నిలబడతారు, ముఖ్యమంత్రి గారు బలమైన పరిపాలన ఇస్తారని చెప్పి మద్దతు తెలిపితే తెలుగుదేశం నాయకులు జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ ను పేకాట క్లబ్ గా  చేసేసారు.  

* మన చింతలపూడి ఎత్తిపోథల పథకం కడుతున్నామని చెప్తున్నారు గాని.. అక్కడ మెట్ట భూమలకు నీరు ఇవ్వట్లేదు, భూములు కోల్పోయిన వారికి సరైన నష్ట పరిహారం అందించడంలేదు. * * పేద రైతుల భూములకు 10 లేక 12 లక్షల నష్టపరిహారం ఇస్తూ..తెలుగుదేశం నాయకులకు 30 లేక 40 లక్షల నష్ట పరిహారం అందిస్తున్నారు..ఇదే తేడా ఆరోజున గాని నేను చూపిస్తే ఈరోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉండేదా? జనసేన అండగా లేకపోయి ఉంటే తెలుగుదేశం అధికారం లోకి వచ్చేది కాదు.

* ముఖ్యమంత్రి గారి పాలనలో ఉత్తరాంధ్ర నుండి ఏ మూలకి వెళ్లినా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. జంగారెడ్డిగూడెంకి సంబంధించి 42 ఎకరాల ఫారెస్ట్ భూమిని దెందులూరులో వుండే వీధిలో వీచే గాలికి లేచే ఆకు రౌడీ ఆక్రమిస్తే అడిగేవారు ఎవ్వరూ లేరు. 

* ఎవరెవరో బయట అరాచక శక్తులు జంగారెడ్డిగూడెం వచ్చి ఆక్రమించుకుంటుంటే మీకు పౌరుషం రావట్లేదా? మీకు కోపం రాదా? మీకు అన్యాయం అనిపించట్లేదా? నాకు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది.

* ముఖ్యమంత్రి గారు జ్యూడిసరీ కమీటీలు వేశాం అని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో కూడా కమిటీలు వేశారు, కానీ పట్టించుకున్న పాపాన లేదు. 2019లో తెలుగుదేశం వారు అధికారంలోకి వస్తున్నారని నమ్మితే తెలుగుదేశం వారు పొరపాటు పడినట్టే!!

* 2019 - 2021 మధ్యలో దేశంలో సరికొత్త రాజకీయ వ్యవస్థ రాబోతుంది. చాలా సమ్మూలమైన రాజకీయ సమీకరణాలు ఉంటాయి, భారీ మార్పు రాబోతుంది. కొన్ని సర్వేలు జనసేన పార్టీకి 5 శాతమే ఓట్లు వస్తాయి అంటారు..గెలుపుకి, ఓటమికి తేడా 2 శాతమే!!

* ఒక 30 - 40 సీట్లు వున్న వ్యక్తి కర్ణాటకలో ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఊహించారా? రాజకీయాలు డబ్బుతో కూడుకున్నది అని నాకు తెలుసు, అయినా గాని భావితరాలు ఈ దుర్మార్గుల హస్తాలలో నలిగిపోకూడదని నేను రాజకీయాల్లోకి వచ్చాను.

* రౌడీ రాజకీయం, గుండా రాజకీయం చేసిన వారికి అండగా నిలుస్తారని చెప్పి నేను 2014లో తెలుగుదేశానికి మద్దతు తెలపలేదు. ప్రజలకు అండగా ఉంటారని నమ్మి మద్దతు తెలిపాను. ఎవరైనా రౌడీ, గుండా రాజకీయాలు చేస్తే కాళ్ళు విరగ్గొట్టి కింద కూర్చోపెడతాం అని ఇక్కడున్న యువత చెప్పండి. 

* ముఖ్యమంత్రి గారు మా అరాచకాలు ఎక్కడున్నాయి అని సాక్ష్యాలు అడుగుతున్నారు? సర్వే నెంబర్.1 బుట్టాయగూడెం గ్రామంలో 400 ఎకరాల అటవీ భూములు తెలుగుదేశం నాయకులు , మరియు మిగతా అధికారులతో కలిసి కబ్జా చేశారు..దీని మీద ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించాలి. ఎవరు కబ్జా చేశారు? దెందులూరులో వుండే ఒక ఆకు రౌడీకి ఇక్కడ ఏం పని? కబ్జా చెయ్యడానికి ఏం పని? వంటి అంశాల మీద విచారణ జరిపించాలి. 

* 2019 ఎన్నికలకు భయపడే ఓట్లు తొలగిస్తున్నారు. 21 లక్షల మంది ఓట్లు తొలగించారు. ఇందులో 19.22 లక్షల ఓట్లు యువతరానియే. ఇవన్నీ మన ఓట్లే. 2009లో కూడా ఇలాగే చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేనివారు నమోదు చేసుకొనేలా చేయాలి. జనసేన గెలిచే తొలి సీటు చింతలపూడి కావాలి. ఏలూరు ఎంపీ సీటు కూడా దక్కించుకోవాలి.

 

 

 

SOURCE:JANASENA.ORG

 

03 Oct, 2018 0 433
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved