నా ఆఖరి శ్వాస వరకు సంపూర్ణంగా మీకు అండగా నిలబడతా - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-speech-in-meeting-with-bc-society-in-bhimavaram_g2d


భీమవరంలో బిసి కమ్యూనిటీ సోదరులతో జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం : 

 

* ఇక్కడికి వచ్చిన బీసీ కుల సంఘ నాయకులకు, పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాను 

* మత్స్యకారుల సమస్యలు నాకు బాగా తెలుసు. మీ బాధలను గుండెల్లో పెట్టుకున్నా.

* జనసేన పార్టీని ప్రశ్నించే పార్టీగా మిగిల్చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఒక పార్టీ బాధ్యత కాదు.

* చాలా మంది అనుకూలంగా జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పి అధికారం ఇంకొకరికి ఇవ్వొచ్చు అని తీసుకెళ్తున్నారు. అన్యాయం జరుగుతున్నప్పుడు ముందుగా ప్రశ్నిస్తాం. తర్వాత ప్రణాళికను రూపొందించి సమస్యను పరిష్కరిస్తాం.

* దశాబ్దాలుగా అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడలేకపోవడం వల్లనే మనం ఈ స్థితిని అనుభవిస్తున్నాం. అధికారం మనం ఇస్తున్నాం. మనం అనుకుంటే ఆ అధికారాన్ని దింపెయ్యగలం. 

* కులాల ఐక్యత సమాజంలో కావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధార పడి ఉన్నాం.

* మీరేం చేస్తారని నన్ను అడిగే ముందు కులాలను నడిపిస్తున్న నాయకులను అడగాలి. ప్రతీ కులంలో సరిచేసుకునేవి కొన్ని ఉంటాయి, అవి కచ్చితంగా సరిచేసుకోవాలి.

* వాళ్ళ చేతిలో మోస పోతున్నాం అని తెలిసి కూడా ఓట్లు వేస్తున్నామంటే మనల్ని మనం కచ్చితంగా ప్రశ్నించుకోవాలి.

* 2009 లో వెనుకబడిన కులాల కోసం ఒక గొప్ప ప్రయత్నం చేసాం. ఆ రాజకీయ విధానంలో అది విజయం సాధించలేదు.

* ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఒక కులంగా మాట్లాడుతారు. గ్రామాలకు వెళ్లిన తర్వాత ముక్కలు ముక్కలుగా ఓడిపోతారు.

* గౌతు లచ్చన్న గారు చాలా గౌరవించే నాయకులు. అతని కులం వాళ్ళు తక్కువ మంది వున్నా అతను సమాజానికి ఎంతో సేవ చేసారు.

*  కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్పితే కులాలు బాగుపడట్లేదు.

* నేను ఇక్కడికి పని చెయ్యడానికి వచ్చా. ముఖ్యమంత్రి గారిలా నన్ను మరోసారి ముఖ్యమంత్రిని చెయ్యండి మీ సమస్యలను తీరుస్తా అనట్లేదు. 

* నాకు చిన్నప్పటినుండి నా కులం తెలియదు. మా ఇంట్లో నన్ను అలా పెంచలేదు. ఈరోజున ఇలా కులాల గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.

*  నాకు దేశభక్తి నేర్పించిన టీచర్ ఒక దళిత కులం నుండి వచ్చింది. ఆమెను నేను అమ్మ అనే వాడిని, వాళ్ళ కొడుకుని అన్న అనే వాడిని.

* అధికారం చెలాయించేది కొన్ని కుటుంబాలే..కులాలు కాదు. ఒకటి ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఇంకొకటి జగన్ గారి కుటుంబం.

* కులాల ప్రకారం లెక్కలు వేసి సమాజాన్ని ముక్కలు చేసేసారు. అందుకే నేను ఓట్లు అడగను.

* ఒక నాయకుడు ఏ కులం కి సంబందించినప్పటికీ అందరికీ అందుబాటులో ఉండాలి. 

* నా కళ్ళ ముందు సమాజం శిథిలం అయిపోతుంటే, మనుషులని కులాలుగా, ముక్కలుగా చూస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. అందుకే నా ఈ తపన.

* ఈరోజు తెలుదేశం పార్టీ బిసి లకు అండగా ఉంటాం అని చెప్పి, పార్లెమెంట్లో బీసీ బిల్లుకి ఎందుకు మద్దతు తెలపలేకపోయారు.

* ఎన్ని రకాలుగా సమాజాన్ని విడదీయాలో అన్ని రకాలుగా విడగొడుతున్నారు. అధికారం, ఆర్ధిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉండడం వలన కొంతమంది మాత్రమే లబ్ది పొందుతున్నారు.

* కొంతమందిని కాదనుకుని ఒక సరికొత్త సమాంతర సమాజాన్ని తీసుకురావడానికి ఎంతో సమయం పట్టదు. బలంగా అనుకోవాలి.

* నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగను, పల్లం దగ్గరకే నీళ్లు రావాలి. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతా...పవన్ కళ్యాణ్ కి అధికారం ఇస్తే మా బిడ్డల జీవితాలు బాగుపడతాయి, మా జీవితాలు మెరుగుపడతాయి అనిపిస్తేనే ఓటు వెయ్యండి. అప్పటి వరకు నేను అడగను.

* ఓటు వెయ్యండి అని అడగడానికి నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. దేశంలో గొప్ప గొప్ప వాళ్లకి పదవులు లేవు. ఈ దేశం ఏమి ఆశించకుండా పని చేసిన వాళ్ళ ద్వారానే నిర్మితమైనది.

* సమస్యను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని, భయాలు తొలగించి అప్పుడు సమస్యను పరిష్కరించాలి. 

* స్థానిక సమస్యలను పరిష్కారం చెయ్యాలి. అందుకే నేను స్థానిక సమస్యల గురించి మాట్లాడుతున్నాను.

* పొలిటికల్ విధానంలో సహనం కావాలి. సహనం లేని వారు రాజకీయాలలో రాణించలేరు. సినిమాల్లో లాగా రెండున్నర గంటలలో మార్పు రాదు. అందుకే నేను అన్ని వదలి ఓపికతో మీతో మాట్లుడుతున్నా...

* నేను మిమ్మల్ని ఆకట్టుకోవాలనో, నమ్మించాలనో ప్రయత్నం చెయ్యట్లేదు. చిత్తశుద్దిగా, త్రికరణశుద్ధిగా దశాబ్దాలుగా ఏ పార్టీ మీకు అండగా నిలబడనంతగా జనసేన మీకు  అండగా నిలబడుతుంది.

* వృత్తుల సంబంధిత కులాలకు ఆత్మ గౌరవం కావాలి. వృత్తులే లేకపోతె భారతదేశం సమాజమే లేదు.

* జపాన్ లో కళలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కానీ మన దేశంలో మన కళలకు అంత గౌరవం ఇవ్వం. అదే మన దౌర్బాగ్యం.

* సంబంధిత కులాల వృత్తులకు నైపుణ్య శిక్షణ అందించాలి. నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పరచాలి.

* నేను మాటలు మార్చను. మీ అందరికీ అండగా వుంటాను.

* గ్రామాల్లో కులాల కన్నా ఆత్మసంబంధం ముఖ్యమైనది, బంధాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మనిషికి మనిషికి వున్న బంధాలకు కులాల వల్ల వ్యత్యాసం రాకూడదు.

* త్వరలో విడుదల చేసే మానిఫెస్టో చూడండి. సలహాలు, సంప్రదింపులు, సూచనలు చెయ్యండి. మిగతావారు మీకు ఎంత అండగా నిలబడ్డారో తెలియదు గాని, నా ఆఖరి శ్వాస వరకు సంపూర్ణంగా మీకు అండగా నిలబడతా.

* గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. 2008 కి మీరు పిల్లలే, 2018 కి కూడా మీరు పిల్లలేనా ?ఏ మూలకు వెళ్లిన యువత ప్రశ్నిస్తుంది. వాళ్లకి నాయకులు చేస్తున్న అన్యాయాలు తెలుస్తున్నాయి.

* దయచేసి ఈ జనరేషన్ మారండి. నేను లెక్కలు వేసి రాలేదు, సామాజిక మార్పు కోరి వచ్చా.

* అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని సృష్టించారు. మన శాసన సభ్యులు రాజ్యాంగాన్ని పాటిస్తే చాలు. వాళ్ళు అది చెయ్యరు, అదే సమస్య.

* నాకు స్వార్ధం లేదు. రామ్ మనోహర్ లోహియా ఆలోచన విధానాన్ని నమ్ముతాను కాబట్టి ఎక్కడైతే వెనుకబాటు కులాలు ఉన్నాయో వాటికి న్యాయం చేస్తా.

 

 

SOURCE:JANASENA.ORG

09 Aug, 2018 0 391
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved