2019లో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు - శ్రీ పవన్ కళ్యాణ్...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-speech-with-dwakra-women_g2d

  డ్వాక్రా మహిళలతో జరిగిన సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :

 

* ఇక్కడికి వచ్చిన డ్వాక్రా మహిళలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు హృదయపూర్వక ధన్యవాదములు.

* డ్వాక్రా గ్రూపులలో ఉన్నవారందరికీ బ్యాంకింగ్ వ్యవస్థ మీద అవగాహన ఉండదు. గ్రూపులో వున్న సభ్యుల అనుమతి లేకుండా సభ్యుల ఫోటోలు పెట్టి కొంతమంది రుణాలు పొందుతున్నారు. దీని ద్వారా శ్రమ దోపిడీ జరుగుతుంది. 

* డ్వాక్రా మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్లినా గాని కొట్టి పంపించేస్తున్నారు. రాష్ట్రం నలుమూలలా ఇలానే వుంది.

* తెలుగుదేశం నాయకులు చేసిన తప్పులకి మీరు తప్పు చేసారంటూ డ్వాక్రా మహిళలను ఇసుక రీచ్ ల దగ్గర కూర్చోపెడుతున్నారు. నాయకులు చేసిన తప్పులకి అమాయకులను బలి చేస్తున్నారు..డ్వాక్రా శాఖలో ఏమైనా అవకతవకలు ఉంటే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను.

* పరిటాల సునీత గారి ఆధ్వర్యంలో వున్న శాఖలో ఈ సమస్య వుంది..ఆమె అర్ధం చేసుకుని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను.

* డ్వాక్రా పథకాలు గాని, ఏ ఇతరత్రా పథకాలుకు గాని ముఖ్యమంత్రి గారు ఆయన జేబులో నుండి ఏమీ డబ్బు తియ్యట్లేదు. ఇది మీ కష్టార్జితం..మీరు పెట్టుకున్న డబ్బులు మీకు ఇవ్వకుండా ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. 

* ప్రభుత్వం ఉచితంగా డబ్బు ఇవ్వట్లేదు. ఇది మన ఉమ్మడి సొమ్ము...డ్వాక్రా సంఘాలలో సిఎ లు ఎవరైతే వున్నారో వారిని నిలదీసే హక్కు మనకు వుంది. మీరు నిలదీసే పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష నిర్లక్ష్యం వహిస్తే మూడవ పక్షంగా వున్న జనసేన మీకు అండగా ఉంటుంది. 

* ఈరోజున జనసేన పార్టీ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం కొరకు ముందుకు తీసుకువెళ్తుంది, పోలవరంతో సహా...

* డ్వాక్రా మహిళల దగ్గర దోపిడీ చేస్తున్నారు. బ్యాంకులు రుణమాఫీ చెయ్యాలంటే పాత రుణాలు కట్టాలంటున్నారు. ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చినప్పుడు ఆయనను 5 అంశాలు అడిగాను అందులో ఒకటి డ్వాక్రా రుణ మాఫీ...డ్వాక్రా రుణమాఫీ సాధ్యపడుతుందా అని ఆరోజున ముఖ్యమంత్రి గారిని నేను అడిగితే!! ఖచ్చితంగా జరుగుద్ది, నన్ను నమ్మండి అని ఆయన హామీ ఇచ్చారు. 

* రుణ మాఫీ సవ్యంగా లేదు అని నేను అనేక చోట్ల వింటున్నాను. ఈరోజున మళ్లీ మమ్మల్ని గెలిపిస్తేనే డ్వాక్రా రుణ మాఫీలు చేస్తాం అని బెదిరింపులకు తెలుగుదేశం వారు దిగుతున్నారు. మిమ్మల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దయచేసి తెలుగుదేశం నాయకులు గాని, ముఖ్యమంత్రి గారు గాని ఏం చెప్పినా భయపడొద్దు.

* నిజముగా డ్వాక్రా గాని బాగుని ఉండుంటే 2004, 2009లో ముఖ్యమంత్రి గారు ఓడిపోయేవారు కాదు. 2014లో ఆయనకు సొంత బలం ఉంటే జనసేన అవసరం ఉండేది కాదు, 2019లో కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తెలుగుదేశం ఏకపక్షంగా గెలిచే ఆస్కారం లేదు. 

* యువతను కూర్చోపెట్టి 1000 రూపాయలు ఇస్తామంటున్న ప్రభుత్వం వారికి వేరే విధంగా సహాయం చెయ్యొచ్చు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెయ్యకుండా.. కష్టపడి, ఉద్యోగాలు చేసుకునే యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని అంటుంది. ముందు ఆడపడుచులకు అండగా నిలబడండి...

* ఉద్యోగాలు ఇవ్వకుండా పాకెట్ మనీ ఇస్తామంటున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పాకెట్ మనీ ఇవ్వడమేంటి ?

* వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు స్వయంగా గెలిచే పరిస్థితి లేదు, అందుకని మీరు బలంగా మీ హక్కులను సాధించుకోవడానికిం మంచి సమయం ఇది..వారు పబ్బాలు గడుపుతున్నారు గాని మీకు న్యాయం జరగట్లేదు. 

* మాకు అన్యాయం జరిగింది అని డ్వాక్రా వాళ్ళు అంటుంటే వాళ్లకి న్యాయం జరిగేలా ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా తిరిగి వారిని పోలీసులు చేత కొట్టిస్తున్నారు.

* 2019లో 100 శాతం తెలుగుదేశం స్వయంగా గెలిచే అవకాశం లేదు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తేనే రుణాలు మాఫీ చేస్తామంటున్నారు. ఇది మనం కష్టపడిన సొమ్ము..మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది.

* తెలుగుదేశంలో వున్న నాయకులు మన డబ్బుని వందల వందల కోట్లు సంపాదిస్తున్నారు..అది మన డబ్బు, మన డబ్బుని అడగడానికి మనకి హక్కు వుంది. 

* 2019లో కొత్త ప్రభుత్వం వస్తాది, అది జనసేన వస్తుందా? లేక సంఖ్యా బలంతో వస్తుందా అన్నది కాలం నిర్ణయిస్తుంది. తెలుగుదేశం, వైసీపీ అయితే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

*  ఈరోజున జనసేన పార్టీయే లేకపోతె ఇలాంటి సభలు జరిగేవి కాదు. ఈరోజుకీ పోలవరం 7 ముంపు మండలాల్లో ఇంకా సమస్యలు వున్నాయి, డ్వాక్రా సమస్యలు వున్నాయి...రాష్ట్ర స్థాయిలో డ్వాక్రా మహిళలకు ఒక సమావేశం పెట్టి మీ సమస్యలపై మరింత అధ్యయనం చేస్తా...

* ప్రభుత్వ పథకాలు అన్నీ మీకు రావాల్సినవే..మీరు ఓట్ బ్యాంకు కాదు, మీరు ఎవరికీ భయపడకండి. రుణాలు ఇవ్వడమనేది ప్రభుత్వం మనకి కల్పించాల్సిన హక్కు.

 

 

 

SOURCE:JANASENA.ORG

 

03 Oct, 2018 0 418
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved