ద‌స‌రా సంద‌ర్బంగా అమ్మవారి న‌వ‌రాత్రి దీక్ష స్వీకరించిన శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు..
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-takes-navarathri-deeksha-as-a-part-of-dasara_g2d

పోరాట‌యాత్ర‌లో భాగంగా పోల‌వ‌రంలో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు బుధ‌వారం ప‌ట్టిసీమ‌లోని చారిత్రాత్మ‌క శ్రీ భ‌ద్ర‌కాళీ స‌మేత వీరేశ్వ‌రస్వామి వారిని ద‌ర్శ‌నం చేసుకున్నారు.

1400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ ఆల‌యం ప‌ట్టిసీమ గోదావ‌రీ గ‌ర్భంలో ఉంది. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన లాంచీలో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు గోదావ‌రి దాటి  వెళ్లారు. సుమారు కిలోమీట‌ర్ దూరం ఇసుక తిన్నెల‌పై కాలి న‌డ‌క‌న ఆల‌యానికి చేరుకున్నారు. లాంచి ద‌గ్గ‌ర నుంచి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి ఆల‌య సిబ్బంది మేళ‌తాళాల‌తో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వీరేశ్వ‌రస్వామికి ప్ర‌త్యేక అభిషేకాలు నిర్వ‌హించారు. భ‌ద్ర‌కాళీ అమ్మ‌వారిని ద‌ర్శించుకుని కుంకుమార్చ‌న‌లు నిర్వ‌హించారు. వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు స్వీక‌రించారు. అనంత‌రం ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల మొద‌టి రోజు కావ‌డంతో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు అమ్మ‌వారి దీక్ష‌ను స్వీక‌రించారు.

విజ‌య‌ద‌శ‌మి వ‌ర‌కు తొమ్మిది రోజుల పాటు ఈ దీక్ష కొన‌సాగుతుంది. ఈ తొమ్మిది రోజులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఘ‌నాహారం స్వీక‌రించ‌రు. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్బంగా చాతుర్మాస దీక్ష చేప‌ట్టే వారు. పోరాట యాత్ర నేప‌ధ్యంలో 9 రోజుల పాటు మాత్ర‌మే దీక్ష కొన‌సాగించ‌నున్నారు. ఈ తొమ్మిది రోజులు పాలు, ప‌ళ్లు మాత్ర‌మే స్వీక‌రిస్తారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

 

11 Oct, 2018 0 483
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved