23 న నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొననున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-to-participate-in-roti-festival-on-september-23rd_g2d

ప్రసిద్ధిగాంచిన నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు  ఈ నెల 23 న నెల్లూరు వెళ్తారు. బారా షహీద్ దర్గాను సందర్శించి ప్రార్ధనలు చేస్తారు.

25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన మొదలవుతుంది. శుక్రవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పర్యటన కార్యక్రమాలపై రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్), జిల్లా సమన్వయకర్తలు, సంయుక్త సమన్వయకర్తలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించి ప్రణాళిక ఖరారు చేశారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన ఏడు నిజయోజకవర్గాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు. ఈ పర్యటన 25 వ తేదీన ఏలూరులో మొదలవుతుంది. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి, అక్కడి పనులను పరిశీలిస్తారు.

పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తారు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం అందించిన తీరు, వాళ్ళ బాధలపై నేరుగా వారితోనే మాట్లాడతారు. ముంపు మండలాల్లోని గ్రామాలకు వెళ్తారు. అక్కడి సమస్యలను నేరుగా పరిశీలిస్తారు. అన్ని నియోజకవర్గాల్లోని సమస్యలపై సంబంధిత వర్గాలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. పశ్చిమ గోదావరి పర్యటన తరవాత తూర్పు గోదావరి జిల్లాలోకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడుగుపెడతారు. తూర్పుగోదావరికి చేరే వరకూ ఏకబిగిన పర్యటన సాగుతుంది.

 

 

 

SOURCE:JANASENA.ORG

22 Sep, 2018 0 352
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved