పవన్ కళ్యాణ్ వ్రతం.. నాలుగు నెలల పాటు కఠిన నియమాలు...
విభాగం: జనరల్
pawan-kalyan-vratham--strict-rules-for-four-months-_g2d

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. ఈ విషయాన్ని జనసేన మీడియా విభాగం తెలియజేసింది.

చాలా రోజు నుంచి మీడియాకు దూరంగా ఉన్న జనసేనాని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఈనెల 23న ప్రజల ముందుకు రాబోతోంది.

పవన్ కళ్యాణ్ చాతార్మాస్య దీక్ష (దీన్నే వ్రతం అని కూడా అంటారు) చేపట్టినట్టు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చాతుర్యాస్య దీక్ష హైందవ సంప్రదాయంలో ఉంది. నాలుగు నెలల పాటు చేపట్టాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్షలు చేయాలి.

ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొంటాడని నమ్మకం. ఈ మధ్యలో నాలుగు నెలల కాలం ఉంటుంది. ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం. ఈ నాలుగు నెలలు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

పీఠాధిపతులు, జీయర్లు వంటి వారు ఈ చాతుర్యాస్మ దీక్షను చేపడతారు. ఈ నాలుగు నెలలు వారు పొలిమేర దాటరు. వాళ్లే చేయాలనే నిబంధన లేదు. ఎవరైనా చేయవచ్చు. కానీ అందుకు కొన్ని నియమాలు ఉన్నారు.

అరుణోదయవేళ స్నానం చేయాలి. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.

ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చు.

24 Jul, 2020 0 417
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved