ఉద్దండరాయునిపాలెం రైతులతో దీక్ష విరమింపజేసిన పవన్ కళ్యాణ్
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-who-broke-up-the-hunger-strike-with-farmers_g2d

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాకా అందరూ కలిసి నివసించేలా రాజధాని నగరం అమరావతిని నిర్మిస్తామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు.

ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే అమరావతిని 56 వేల ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారు చేస్తారేమో అనిపిస్తోందన్నారు. ఇది కేవలం ధనవంతులు మాత్రమే నివసించే నగరంలా చేస్తారేమో అన్నారు. శనివారం సాయంత్రం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో అసైన్డ్ భూములకీ పట్టా భూములతో సమానమైన ప్యాకేజి ఇవ్వాలని రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. వారి డిమాండ్లకు మద్దతు ఇస్తూ, వారి పక్షాన పోరాడతానని హామీ ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "ఈ రైతులు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవే. రాజధాని కోసం చేసిన భూ సమీకరణలో పభూయిష్టంగా ఉంది. బలవంతపు భూ సేకరణకీ సిద్ధం అవుతున్నారు. ఈ అంశాలపైనే విజయవాడలో పార్టీ తరఫున సదస్సు నిర్వహించాం.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు కొవ్వొత్తుల కరిగిపోతున్నారు. వారికి తగిన పరిహారం, పెన్షన్ ఇస్తే కనీసం వారి జీవితానికి మిణుకుమనే వెలుగు అయినా వస్తుంది. ఈ రైతాంగానికి న్యాయం జరగాలి. పట్టా భూమితో సమానంగా అసైన్డ్ భూమికీ ప్యాకేజి ఇవ్వాలి. ఆ స్ధలాన్ని అమ్ముకొనే హక్కు కల్పించాలి. రైతులు, రైతు కూలీల కుటుంబాలకి నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలనే వీరి డిమాండ్ సమంజసమే. అలాగే నివాస స్థలం, ఉచిత గృహాల డిమాండ్లు నెరవేర్చాలి. జనసేన ప్రభుత్వంలో ఏ రైతూ, ఎవరూ కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండదని చెబుతున్నాను. మీ అందరి సహకారంతో జనసేన ప్రభుత్వం వస్తుంది. అందరూ కలిసి ఉండేలా ప్రజా రాజధానిని నిర్మించుకుందాం. జ‌న‌సేన పార్టీ ఒక కులానికో, మ‌తానికో, ప్రాంతానికో న్యాయం చేసే పార్టీ కాదు. అంద‌రికి స‌మాన‌మైన న్యాయం జ‌రిగేలా చేసే పార్టీ. 2003వ సంవ‌త్స‌రం నుంచి జ‌రుగుతున్న భూదోపిడి చూసి క‌డుపు మండి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను.

ఒక చెట్టు మీద ప‌క్షులు ఎలా ఆధార‌ప‌డి ఉంటాయో.. ఒక భూమి మీద అనేక మంది ఆధార‌ప‌డి బ‌తుకుతారు. భూములు లాక్కుంటే ఎక్క‌డికి వెళ్లిపోతారు?  ద‌ళితులు కోరుకుంటున్నది.. స‌మన్యాయం. అది కూడా ప్ర‌భుత్వం చేయ‌లేకపోతోంది. అంబేద్క‌ర్ స్ఫూర్తిని కొన‌సాగించ‌న‌ప్పుడు ఆయ‌న విగ్ర‌హాల‌కు పూల‌మాలు వేయ‌డం ఎందుకు? అంబేద్క‌ర్ ఆశ‌యాలు, స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తాను” అన్నారు

 

SOURCE:JANASENA

29 Jul, 2018 0 368
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved