మహోన్నత నేతకు మహా నివాళి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-pays-his-last-respect-to-vajpayee_g2d

మాజీ ప్రధాని, భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజపేయి మహాభి నిష్క్రమణ భారత దేశానికీ తీరని లోటు. ఆయన మన మధ్య ఇక ఉండరన్న విషయం జీర్ణించుకోవడం సాధ్యం కానిది.

వాజపేయి మృతికి యావత్ జాతితోపాటు నేను దుఃఖపడుతున్నాను.  ఆయన ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి. ప్రధాన మంత్రిగా మన దేశానికి ఆయన సాధించిపెట్టిన విజయాలు సర్వదా కీర్తించదగినవి. భారత దేశాన్ని అణుశక్తి దేశంగా ఆవిష్కరించడానికి ఆయన చూపిన వజ్ర సంకల్పం, దేశ రక్షణకు కవచంగా మారింది. శత్రువులు మనవైపు కన్నెత్తి చూడడానికి భయపడేలా చేసింది. ఆయన హయాంలో మన దేశం అన్ని రంగాలలోను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈనాటి రాజకీయనాయకులకు సర్వదా ఆచరణీయం. నిస్వార్ధ రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. వాజపేయి రాజకీయ జీవిత ప్రయాణంలో కాంతులీనే కోణాలు ఎన్నో..మేలి మలుపులు మరెన్నో.

బహు భాషా కోవిదుడైన శ్రీ వాజపేయి ప్రసంగాలు రాజనీతి మేళవింపుగా   ఎంత సేపు విన్నా వినాలనిపించేవిగా ఉంటాయి. కవిగా, రచయితగా ఆయన మనకు పంచిన కవితా సౌరభాలు చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భరతమాత ముద్దు బిడ్డగా పుట్టడం మన జాతి అదృష్టం. ఈ పుణ్య భూమికి ప్రధాన మంత్రిగా సేవలు అందిచడం మన భాగ్యం. రాజకీయ భీష్మునిగా కీర్తిని అందుకున్న శ్రీ వాజపేయి చిరస్మరణీయుడు. ఆయనకు  భరత జాతి ఎంతో రుణపడి వుంది. మహా మహోన్నతమైన శ్రీ వాజపేయి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..ఆ మహా మనీషికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

 

 

SOURCE:JANASENA.ORG

17 Aug, 2018 0 352
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved