జగన్ గారిపై దాడి అమానుషం - శ్రీ పవన్ కళ్యాణ్ గారు....
విభాగం: రాజకీయ వార్తలు
pawan-reacts-on-attack-over-jagan_g2d

   ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అమానుషం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా విశ్వసిస్తుంది.

ఈ హత్యా ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేతపై జరిగిన ఈ దాడిని తీవ్రమైనదిగా జనసేన భావిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. గాయం నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

 

 

 

 

SOURCE:JANASENA.ORG

25 Oct, 2018 0 346
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved