పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawan-says-thanks-for-wishing-him-on-his-birthday_g2d

 చిన్ననాటి నుంచి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అలవాటు లేనందున సెప్టెంబర్ 2 నా పుట్టిన రోజు అయినప్పటికీ ఎప్పటిలాగే నేను ఎటువంటి వేడుక చేసుకోలేదు.

అయితే  నాపై అభిమానంతో రెండు రాష్ట్రాలు, విదేశాలలో నాకు పుట్టిన రోజు వేడుకలు జరిపిన జనసైనికులు, అభిమానులు, వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకు పేరు పేరునా ధన్యవాదాలు. మీరే నా బలం. మీరే నా ఆనందం.

పుష్పగుచ్ఛం పంపి శుభాకాంక్షలు తెలిపిన రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, ఈనాడు చీఫ్ ఎడిటర్ శ్రీ రామోజీరావు గారికి, ట్విట్టర్లో శుభాకాంక్షల సందేశం పంపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని జనసేన నాయకులూ, వ్యక్తిగతంగా శుభాకాంక్షల సందేశాలు తెలిపిన ప్రతి ఒక్కరికీ  నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలిపారు.

 

 

 

 

SOURCE:JANASENA.ORG

03 Sep, 2018 0 459
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved