తిత్లీ' తుఫాను బాధితులకు సహాయ సహకారాలను అందించండి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం:
రాజకీయ వార్తలు

గత కొన్ని రోజుల నుండి ఉత్తరాంధ్ర ప్రజలను వణికిస్తున్న 'తిత్లీ' తుఫాను గంటకు 120 - 140 కిలోమీటర్ల వేగంతో గురువారం రాత్రి తీరం దాటింది.
తుఫాను తీరందాటే సమయంలో అధిక గాలులు వీచడం వల్లన విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. వేల ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది, అంతే కాకుండా కొంత మంది మృత్యువాత పడ్డారు, అనేక మంది రోడ్డున పడ్డారు. ఈ సంఘటనపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ నిన్నటి తుఫాను వలన ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అండగా సహాయ సహకారాలు అందిస్తున్న జన సైనికులకు కృతజ్ఞతలు, అలాగే మిగతా పార్టీ నాయకులని, శ్రేణుల్ని మన వంతు సహాయ సహకారాలు అందిచవలసిందిగా కోరుతున్నాను అంటూ తెలిపారు.
SOURCE:JANASENA.ORG
12 Oct, 2018
0
362
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు