మూడు పెళ్ళిళ్ళు అందుకే చేసుకోవాల్సి వచ్చింది
విభాగం: రాజకీయ వార్తలు
pawan-speaks-about-the-reason-for-his-3-marriages_g2d

తన జీవితంలో వ్యక్తిగతంగా ఉన్న మూడు పెళ్ళిళ్ళ వ్యవహారంపై జనసేన అధినేత పెదవి విప్పారు. తాను ఎందుకు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చిందో అన్న దానిపై వివరణ ఇచ్చుకున్నారు. తాను ఏం ప్రశ్నించినా… పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయని విమర్శలు చేస్తున్నారని, అయితే వీరిలా ఒక పెళ్లి చేసుకుని, తాను బలదూర్లు తిరగలేదని మండిపడ్డారు. నా కర్మ… కుదరలేదు… ఇలా జరిగింది… ఏం చేద్దాం… మంచో చెడో జరిగింది… నాకేమీ ఒళ్ళు పొగరెక్కి చేసుకోలేదు మూడు పెళ్ళిళ్ళు..! నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టం, ఎందుకంటే వీడు ఎప్పుడూ బయటోళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళకు ఏమైంది, వీళ్ళకు ఏమైంది అంటూ రోజూ ఏడుస్తూ ఉంటాను, దీంతో నా పక్కనుండే వాళ్లకి సుఖం ఏముంటుంది? అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసారు. తనను సినిమా యాక్టర్ అని అందరూ అనుకుంటారని, కానీ నేను లోపల ఓ గది మూలలో కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటానని, పార్టీలు ఉండవ్, పబ్ లు ఉండవ్… ఎప్పుడూ ఆవులు, గేదెలు దగ్గర ఉంటాను, లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాను, నాతో సుఖం ఏముంటుంది? అంటూ తన మూడు పెళ్ళిళ్ళకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసారు పవన్ కళ్యాణ్.

 

 

SOURCE:MIRCHI9.COM

14 Aug, 2018 0 360
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved