ఎంత సుధీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది - జనసేనాని..
విభాగం: రాజకీయ వార్తలు
pawan-speech-in-jangareddygudem_g2d

 జనసేన "జనబాట" ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :

* ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, ఆడపడుచులకు, రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు.

* మన దేశం ప్రజాస్వామ్య దేశం..ఇక్కడ మనకున్నది ఓటు అనే ఒకే ఒక్క ఆయుధం..అది సద్వినియోగం చెయ్యకపోవడం వల్లనే దుర్మార్గులు, రౌడీలు రాజ్యం ఏలుతున్నారు..

* రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యంలో నువ్వు ఏమి చేయగలవు అని అడిగితే గాంధీజీ గారు నేను ఒక సామాజిక ప్రయోగం చేస్తున్నా, ఇందులో మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం అని చెప్పారు. 

* ఒక్క మనిషి తాలూకు శక్తి మామూలుది కాదు. విడిగా ఒక్కొక్కడిగా ఉంటే మన శక్తి మనకు తెలియదు. ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో రాజకీయ జావాబుదారీతనం లేదు, రాజకీయ జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి జనసేన పార్టీ మన ముందుకు వచ్చింది.

* ప్రజలు విడిపోతున్నారు, అనేక సమస్యలు వున్నాయి అని ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. శ్రీకాకుళంకు చెందిన బీసీలు తెలంగాణాలో ఓసీలుగా మారిపోతున్నారు. తెలంగాణలో ఉన్న బీసీలు ఆంధ్రాలో ఓసీలు అయిపోయారు. దీని మీద ఏ ఒక్కరూ మాట్లాడరు. ఇలాంటి సున్నిశితమైన సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా పరిష్కరించాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదు.

* ఎప్పుడూ మార్పు అనేది ఒక వ్యక్తితోనే మొదలవుతుంది. ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

* ఓటు విలువ ప్రతీ ఒక్కరికి చెబుదాం..మనమెందుకు రాజకీయ నాయకులకు దేహి అనాలి? వీధిలో వీచే గాలికి ఎగిరే ఆకు రౌడీ కూడా మన మీద ఆధిపత్యాన్ని చలాయిస్తుంటే..చిన్నపాటి వ్యక్తి అన్ని నియోజకవర్గాలలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే మనమెందుకు భరించాలి?

* నేను వచ్చేటప్పుడు యువత కేకలతో, అరుపులతో వస్తున్నారంటే అది నన్ను చూసి కాదు, వారిలో ఆవేదన..కోపం.. మన కోసం ఒక వ్యక్తి వస్తున్నాడని నమ్మకం.  

* అనేక భిన్నమైన భాషలు మరియు సంస్కృతుల కలయిక మన దేశం.ఎన్నో ప్రాంతాల మారు మూల గ్రామాల నుండి లక్షల మంది త్యాగాలు చేస్తే ఈరోజున మనకి ఈ దేశం వచ్చింది.  ఒక్కొక్కడు ఇసుక దోపీడీలు, మరేవో దోపీడీలు చేసేస్తుంటే మన దేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని భావించి నేను రాజకీయాల్లోకి వచ్చాను. 

* నేను పోరాటం చెయ్యడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను పార్టీ పెట్టేటప్పుడు జగన్ సీఎం అవ్వబోతున్నాడు నువ్వు ఏమి చేస్తావు అని ఇప్పుడు నా వెంట తిరిగే వారు కూడా అడిగారు.

* ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఏంటో అది నీ వ్యక్తిత్వం..అందరూ తప్పించుకుంటున్నారు, 150 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్, నాలుగు దశాబ్దాల అనుభవం వున్న వారు కూడా ఏమీ చేయలేకపోయారు.

* మీ అరుపులు, కేకలు నేను అర్ధం చేసుకోగలను. మీకంటే 10 ఇంతలు నాకు ఆవేశం, కోపం ఉంటాయి దుర్మార్గుల మీద, దౌర్జన్యాలు చేసే వారి మీద, దోపిడీ చేసే వారి మీద..నేను మీలా కేకలు, అరుపులు పెట్టను..ఓటు వేసి మార్పును బద్దలు కొడతాను, అది మీరు చెయ్యగలరా? 

* జనసేన నాయకులకు, పెద్దలకు కూడా చెప్తున్నా...తెలుగుదేశం, వైసీపీ లలో కుటుంబాలకు సంబంధించిన వారు ఎక్కువ వుంటారు..నేను మాత్రం మిమ్మల్ని కుటుంబంగా భావించి పార్టీ పెట్టాను.

* చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ ని తప్ప ఇంకెవరినీ నమ్మరు, జగన్ గారు వాళ్ళ కజిన్స్ ను..మావయ్యని తప్ప ఇంకెవరినీ నమ్మరు..నేను మాత్రం అందరినీ నమ్ముతాను. 

* జనసేన నాయకులు దయచేసి కోటరీలు ఏర్పాటు చెయ్యొద్దు. ఒక కులానికో, ప్రాంతానికో, మతానికో నేను పార్టీ పెట్టలేదు..ఓపిక ఉంటే పార్టీని ముందుకు తీసుకెళ్లండి తప్పితే తూట్లు మాత్రం పొడవకండి. 

* నా ఆశయాలకు ఎవ్వరూ కూడా తూట్లు పొడవలేరు. నాది చాలా బలమైన సంకల్పం..నేను ఈరోజున రావడానికి 25 సంవత్సరాల కృషి వుంది. 

* 23 సంవత్సరాల వయసున్న ఇప్పుడు యువత పబ్బుల్లో, బారుల్లో తిరుగుతున్నారు కాని అదే వయస్సులో భగత్ సింగ్ నా చావు దేశంలో రాబోయే తరాలకు మేల్కొల్పు అని చెప్పారు. 

* నేను ఎప్పుడూ కూడా ఇది ఎందుకు చెయ్యలేదు అని అడగను, నేను ఏమి చెయ్యగలను అని ఆలోచిస్తాను. 

* ఒక మనిషికి ప్రమాదం జరిగి రోడ్డు మీద పదడిపోయి ఉంటే...ఆ మనిషికి నేను ఏమైనా సహాయం చేస్తే నాకు ఏమవుతుందో అని ఆలోచించే వారు ఒకరు వుంటారు, చెయ్యకపోతే ఆ మనిషి ఏమవుతాడనే అని ఆలోచించే వారు ఒకరు వుంటారు...ఎదుటి మనిషి గురించి ఆలోచించేవారు సమాజంలో ఖచ్చితంగా మార్పు తీసుకురాగలరు.

* 2019లో అద్భుతాలు జరుగుతాయో లేదో నాకు తెలియదు..నేను 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడానికి వచ్చాను. ఖచ్చితంగా ఈ దోపిడీ రాజకీయాలను తరిమి కొడతాను..ఇది నా సంకల్పం..ఇది మన దేశం కోసం, బలమైన పాలసీలు పెట్టడానికి నాకు నేను ఏర్పరుచుకున్న సంకల్పం.

* అందరూ నీ వెనుక యువత ఎందుకు వుంటారు అని అడుగుతుంటారు..నేను యువత కోసం ఏడ్చిన రోజులు వున్నాయి..ఇంత అన్యాయం జరుగుతున్నా యువత తరపున మాట్లాడే వారు ఎవరూ లేరు అని బాధపడే వాడిని.

* జనసేన పార్టీ లేకుండా ఉంటే ఈరోజున రాష్ట్రంలో చాలా సమస్యలు బయటకు వచ్చేవి కాదు. 

* రెండు దశాబ్దాల నుండి రాజకీయాల్లో కొనసాగిన వారు ఇప్పటి దాకా మంచి చేశారు, చెడు చేశారు, అధిక శాతం బాధ్యత లేకుండా వ్యవహరించారు. రాబోయే రోజుల్లో దేశంలో బలమైన నాయకత్వం వస్తుంది.

* తమిళనాడు లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, విజయకాంత్ గారు పార్టీలు పెట్టారు..వీళ్ళు పార్టీలు పెట్టింది గెలుస్తామా? లేదా? అని కాదు, వీళ్ళందరూ బలమైన మార్పు కోరుకుంటున్నారు.. 

* ప్రస్తుతం వున్న నాయకత్వం అతి త్వరలో వెళ్ళిపోబోతుంది..2019-2021 మధ్యలో దేశంలో కొత్త నాయకత్వం వస్తుంది.

* జనసేన పార్టీ అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్తుంది. ఒక్క కులాన్ని నమ్ముకున్న వారి నాయకత్వం అంత బలంగా ఉంటే అన్ని కులాల మద్దతు వున్న మన పార్టీకి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది. 

* నా ఆశయాలను అర్ధం చేసుకుంటే నన్ను అర్ధం చేసుకోవడం చాలా తేలిక. అలా కాదు నా ఆశయాల కంటే మీ స్వార్ధం ఎక్కువ అనుకుంటే ఎవరినైనా సరే కూల్చేస్తాను. నాకు తన, మన బేధం లేదు. లోపల వున్న వ్యక్తులు, బయట వున్న వ్యక్తులు నాకు సమానమే!!

* నా పక్కన వున్న నాయకులు మేము ఏమీ చేసినా నాకు తెలీదు అనుకుంటే అది మీ అజ్ఞానం, అవివేకం..నాకు దొడ్డిదారిన వచ్చే అధికారం నాకు అవసరం లేదు, రాజమార్గంలో వచ్చే అధికారాన్ని నేను కోరుకుంటాను. 

 

 

 

SOURCE:JANASENA.ORG

 

 

03 Oct, 2018 0 393
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved