ప్రతీ మనిషి కన్నీళ్లు తుడవాలని ఆశ - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-speech-on-independence-day-in-madhapur-janasena-party-office_g2d

72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాదాపూర్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :

* నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలంగాణ గురించి లేకపోవడం బాధను కలిగించింది, అది కూడా ఉండి ఉంటే ఆనందం కలిగేది, అది కూడా చేస్తాం.

* తమ్ముడు సినిమా అయిపోయిన తర్వాత విజాయోత్సవ సభ చేయకుండా ప్రజలకు ఏదైనా చేద్దామని నల్గొండికి వెళ్తే అక్కడ నాయకులు నన్ను ఫ్లోరోసిస్ బాధితులకు ఏమీ చెయ్యనివ్వలేదు.

* నాకు ఆశ చాలా ఎక్కువ. కొంత మందికి వేల కోట్లు కావాలని ఆశ, మరికొంత మందికి అనేక సార్లు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ. నాకు మాత్రం ప్రతీ మనిషి కన్నీళ్లు తుడవాలని ఆశ.

* అందరి కన్నీళ్లు తుడవలేకపోతున్నందుకు చాలా బాధ పడుతున్నా..

* నాకు తెలంగాణ బాధలు తెలుసు. వీర తెలంగాణ పోరాటాన్ని అర్ధం చేసుకున్నోడిని. అభివృద్ధి కొద్ధి మందికే జరుగుతుంది అని నేను తొలుతగా హైదరాబాద్ లో చూసా.

* ప్రకృతి ఆకృతులు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అభివృద్ది పేరుతో అలాంటి ప్రకృతి ఆకృతులను ధ్వంసం చేసినప్పుడు, పోరాటం చేసినోళ్లు బాధ పడుతుంటే నాకు సబబు అనిపించింది.

* రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర పాలకులను, ఆంధ్ర నాయకులను వేరు చెయ్యమని చెప్పా...దానికి అందరూ ఒప్పుకున్నారు.

* తెలంగాణ రావాలని అందరూ కోరుకున్నారు గాని హింస ద్వారా రావాలని ఎవ్వరూ కోరుకోలేదు. దీనికి సహకరించిన ప్రతీ విద్యార్థికి, ఆడపడుచుకి నేను వందనాలు తెలుపుతున్నా..

* శాఖాహార రాష్ట్రం, మద్యం లేని రాష్ట్రం అయిన మహారాష్ట్రలో హింస చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకే "నా రాజు గాకురమా" అనే పాట సినిమాలో పెట్టా..

* ఈ రాజకీయాలు నీకెందుకురా అని మా అమ్మ అంటే, ఎప్పుడూ దేశంలో పక్కింటోడు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు గాని మన ఇంట్లో వాడు బాధ్యత తీసుకోవాలని కోరుకోరు అని మా అమ్మతో చెప్పా.

*  తెలంగాణలో పుట్టిన వాళ్లకి తెలంగాణ అంటే ప్రేమ ఉంటాదో లేదో నాకు తెలియదు గాని నాకు మాత్రం తెలంగాణ అంటే పిచ్చి, ప్రేమ.

* తెలంగాణ భావోద్వేగంతో కూడిన మన రాష్ట్రం. తెలంగాణ మీద నాకు ఎక్కువ మమకారం. ఆంధ్రాలో దోపిడీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అటు వెళ్ళాను, తెలంగాణకు సంబంధించి దిశానిర్దేశం ఆలోచించి చేస్తాను. 

* ప్రత్యర్ధులు నా మీద దాడికి వస్తే నాకు అండగా నిలబడింది తెలంగాణ యువత, విద్యార్థులు.

* కొత్త తరం నాయకులు తెలంగాణాలో జనసేనలోకి రావాలి. ఆడపడుచులు, మహిళలు, విద్యార్థులు అందరూ రాజకీయాల్లోకి రావాలి. మీ చేతుల్లో పార్టీని పెడతాను, బలంగా చెయ్యండి. నేను మీకు అండగా ఉంటా..

* చట్టసభల్లో బీసీలకు మరియు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాదు, తెలంగాణకి కూడా వర్తించాలి, దేశమంతా వర్తిస్తుంది. 

* నాయకత్వం చూపించుకోవడానికే అవకాశాలు అవ్వాలి. ఒక వజ్రం భూ పొరల్లో దాగి ఉంటాది, ఎక్కడ ఉంటాడో మనకి తెలియదు, తవ్వాలి. తవ్వి తీసి చెక్కితే, అప్పుడు దాని ధగధగలు, వజ్రం విలువ తెలుస్తుంది. 

* ప్రతీ మనిషిలోనూ ఒక వజ్రం దాగి ఉంటుంది. ఒక అత్యున్నత పర్వతం, అతి దీర్ఘా నది ప్రవాహం, అతి లోతయిన సముద్రం, అతి దూరమైన నక్షత్రం వున్నప్పుడు అత్యుత్తమ మానవుడు ఎందుకు ఉండడు. అలా ఉండబట్టే మనం స్వాతంత్య్రం సంపాదించకలిగాం...ఒక అంబేద్కర్, పూలే పుట్టగలిగారు.

* ఆశయ సాధనకు అత్యుత్తమ మానవులు లేకపోతె మన తెలంగాణ సాయుధ పోరాటం సఫలం అయ్యేది కాదు.

 

మరింత సమాచారం కాసేపట్లో...

  

 

SOURCE:JANASENA.ORG

15 Aug, 2018 0 428
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved