భీమవరంలో మలివిడత పోరాటయాత్ర
విభాగం: రాజకీయ వార్తలు
pawan-tour-in-bhimavaram-again_g2d

 జ‌న‌సేన సైద్ధాంతిక బ‌లం వివిధ వ‌ర్గాల‌ని జ‌న‌సేనుడి వైపుకి ఆక‌ర్షిస్తోంది.. ఓ వైపు ద‌శ దిశ లేదంటూ నిత్యం ప‌చ్చ చాన‌ళ్లు, ప్ర‌తిప‌చ్చ ఛాన‌ళ్లు ప‌త్రిక‌ల్లో త‌మ భ‌జ‌న‌ప‌రుల వాయిస్ అంటూ పెద్ద‌క్ష‌రాల వార్త‌ల్లో మీడియా మొత్తం ప్ర‌చురిస్తుంటే..? అస‌లు జ‌న‌సేన‌కి ఉన్న అంత బ‌ల‌మైన సిద్ధాంతం ఏంటి..?

జ‌నాన్ని, వివిధ వ‌ర్గాల‌ను ఆక‌ర్షిస్తున్న ఆ మంత్ర‌దండం ఏంటి..? అంటే జ‌న‌సేన అధినేత ప్ర‌యోగించిన ఆ ప‌వ‌ర్‌ఫుల్ మంత్రం .. రాజ‌కీయం అంటే ప్ర‌జా సేవ‌.. జ‌న‌సేన ఏడు సిద్ధాంతాలు పుట్టినా, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌నం బాట ప‌ట్టి పోరాటం చేస్తున్నా., వీట‌న్నింటి వెనుకు ఉన్న ల‌క్ష్యం మాత్రం ఒక్క‌టే.. ప్ర‌జాసేవ‌..ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం. రాజ‌కీయాలు చేయ‌డానికి, జ‌నాన్ని ఆక‌ర్షించ‌డానికి ఇంత కంటే గొప్ప సిద్ధాంతం ఏం కావాలో? పేరు మోసిన‌, అనుభ‌వ‌జ్ఞులైన రాజ‌కీయ నాయ‌కులు సెల‌వివ్వొచ్చు. ఇక రాజ‌కీయాల్లో నిబ‌ద్ధ‌త‌తో కూడిన ప్ర‌జా సేవ చేయాలంటే నిజాయితీ ఎంత అవ‌స‌ర‌మో, ఎవ‌రికీ అధ‌ర‌ని, బెద‌ర‌ని ధైర్యం కూడా అంతే అవ‌స‌రం. వీట‌న్నింటికంటే మించి వ్య‌క్తిగ‌త బ‌ల‌హీన‌త‌లు., ప్ర‌త్య‌ర్ధికి బ‌లాన్నిచ్చే బ‌ల‌హీన‌త‌లు అస్స‌లు ఉండ‌రాదు. ఇవ‌న్నీ జ‌నసేన అధినేత‌లో పుష్క‌లంగా ఉన్నాయి.

రాజ‌కీయాల‌తో త‌నకు ప‌ని లేదు.. ఎక్క‌డ ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నా, ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిసినా... నిమిషాల్లో అక్క‌డ వాలిపోవ‌డం, ప్ర‌జ‌ల ఇబ్బందుల్ని యావ‌త్ ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్ల‌డం. పార్టీ పెట్టిన నాటి నుండి ఆయ‌న చేస్తోంది ఇదే.. ప్ర‌జ‌ల కోసం వ్య‌క్తిగ‌త జీవితాన్ని త్య‌జించిన ఆ యోగీశ్వ‌రుడు, అదే ప్ర‌జ‌ల కోసం ఎవ్వ‌రు ఎన్ని ర‌కాలుగా దూషించినా దులుపుకుని వెళ్లిపోతారు. కేవ‌లం ప్ర‌జా స‌మ‌స్య‌లు, పొలిటిక‌ల్ పాల‌సీల‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కి మాత్ర‌మే ఆయ‌న బ‌దులిస్తారు. అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ప‌బ్లిక్ పాల‌సీల విష‌యంలో గానీ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే విష‌యంలో గానీ ఎదుర్కొగ‌ల శ‌క్తి, త‌న ప్ర‌త్య‌ర్ధుల‌కి లేద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. విశాఖ వేదిక‌గా జోన్‌పై పోరాటం చేద్దాం ర‌మ్మంటే ఒక్క‌రూ బ‌దులివ్వ‌లేదు.. భీమ‌వ‌రం వేదిక‌గా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ర‌మ్మంటూ స‌వాలు చేసినా ప్ర‌త్య‌ర్ధి కూట‌ముల్లో నోరు మెదిపే నాధుడు లేడు. దీంతో జ‌న‌సేనుడు ఎంచుకున్న మార్గ‌మే స‌రైన‌ద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా, త‌ట‌స్థ‌వాదుల్లో బ‌ల‌ప‌డుతోంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌స్తే, ఖ‌చ్చితంగా ఏదో చేస్తాడు అన్న న‌మ్మ‌క‌మూ నానాటికీ పెరుగుతోంది. దీంతో రాజ‌కీయ ప్రాధాన్యం కోరుకునే వారు, కోరుకోని వారు కూడా జ‌న‌సేనుడితో క‌ల‌సి అడుగులు వేసేందుకు రెడీ అయిపోతున్నారు. విశాఖ‌లో ఊపందుకున్న ఈ ప్ర‌క్రియ గోదావ‌రి జిల్లాల‌కి చేరుకునే స‌మ‌యానికి జెట్ స్పీడ్ అందుకుంది.

ఇక ప్ర‌త్యేక హోదా సాధ‌న‌, విభ‌జ‌న హామీల అమ‌లు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌న‌మే ల‌క్ష్యంగా మొద‌లు పెట్టిన పోరాట యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉంది. తొలి విడ‌త భీమ‌వ‌రం క‌వ‌ర్ చేసిన ఆయ‌న‌, తిరిగి మ‌ళ్లీ అదే కేంద్రానికి చేరుకున్నారు. భీమ‌వ‌రం వేదికగా తొలి విడ‌తలోనే వివిధ వ‌ర్గాల‌ని త‌న వైపు జ‌న‌సేనాని ఆక‌ర్షించారు. ఈ ఆక‌ర్ష‌ణ మ‌లివిడ‌త ఆయ‌న భీమ‌వ‌రంలో అడుగుపెట్టే స‌మ‌యానికి మ‌రింత ఊపందుకుంది.. దీంతో గురువారం భీమ‌వ‌రంలోని నిర్మ‌లాదేవి ఫంక్ష‌న్ హాల్ వేదిక‌గా, ఆయ‌న వివిధ వ‌ర్గాల వారిని క‌లుస్తారు.

ప‌వ‌న్‌ని క‌లిసే వారిలో కేవ‌లం పార్టీలో చేర‌డానికి వ‌చ్చే వారే కాదు.. ఆయ‌న సిద్ధాంతాల‌ను తెలుసుకోవ‌డానికి, త‌మ స‌మ‌స్య‌లు ఆయ‌న ఎదుట వెళ్ల‌బోసుకోవ‌డానికి వ‌చ్చే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ప్ర‌తి ఒక్క‌ర్నీ ఒపిగ్గా ఆయ‌న స‌మాధాన ప‌రుస్తున్న తీరు, జ‌న‌సేన ఏ మేర‌కు బ‌లం పుంజుకుంటోందో చెప్ప‌క‌నే చెబుతోంది. ఇది గోదావ‌రి జిల్లా క‌ధా ఇక్క‌డ ఇలాగే ఎగ‌బ‌డ‌తారులే అన్న వారి నోటికి క‌ర్నూలు జిల్లా టూర్ ఇప్ప‌టికే తాళం వేసింది. వీరంతా ఓట్లు వేస్తారా..? అంటే అభిమానంకి ఆరాధ‌న‌కి ఉన్న బేధ‌మే స‌మాధానం..

 

SOURCE:JANASENA.ORG

09 Aug, 2018 0 352
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved