జాతీయ పతాక రూపకర్తకు జనసేన అధ్యక్షులు నివాళి
విభాగం: రాజకీయ వార్తలు
pawan-tribute-to-pingali_g2d

   మన జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్య గారికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘన నివాళులు అర్పించారు.

గురువారం స్వర్గీయ పింగళి వెంకయ్య గారి జయంతి. ఈ సందర్భంగా గురువారం ఉదయం  హైదరాబాద్ మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో  జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకయ్య గారి చిత్రపటానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూలమాల వేసి, జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు. స్వాతంత్య్ర పోరాటంలో వెంకయ్య గారి త్యాగ నిరతిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్ర శేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

జనసేన కరదీపిక ఆవిష్కారం :  

జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు సిద్దాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా ఈ కరదీపికను రూపొందించారు.

 

SOURCE:JANASENA.ORG

04 Aug, 2018 0 293
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved