విజయదశమి శుభాకాంక్షలు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-wishes-everyone-happy-dusshera_g2d

భారతీయులందరికీ నా తరపున, జన సైనికుల తరపున విజయదశమి శుభాకాంక్షలు.

ఈ పండుగ తరుణంలో నేను సంతోషంగా లేను. తుఫానుకు బతుకులు చిన్నాభినమైన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్నాను. ఊళ్లకు ఊళ్ళు నిర్జీవంగా మారిపోయాయి. వందల ఏళ్లనాటి వృక్షాలు నేలకొరిగాయి. ప్రజలందరూ బరువెక్కిన గుండెలతో ఉన్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. గుక్కెడు నీళ్లు లేక విలవిల్లాడుతున్నారు. ఈ ప్రాంతం ప్రజలు సాధారణ జన జీవనంలోకి వచ్చినప్పుడే మనకు పండుగ రోజు. ఆ జగన్మాత మనందరిపై కృప చూపాలని వేడుకొంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

18 Oct, 2018 0 368
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved