2 వ తేదీన సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖతో చర్చలు
విభాగం: రాజకీయ వార్తలు
pawankalyan-instructs-team-to-do-political-activities-on-time_g2d

జనసేన పార్టీ కార్యకలాపాలను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్)ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.

గురువారం ఉదయం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ప్యాక్ సమావేశాన్ని నిర్వహించారు. జనసేన చేపట్టాల్సిన కార్యకలాపాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరించారు. వాడ వాడకీ జనసేన జెండా కార్యక్రమం చేపట్టడంతోపాటు, పార్టీ విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీ శ్రేణులు ఎప్పుడూ జనానికి చేరువలో ఉండాలని స్పష్టం చేశారు. జనసేన బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలన్నారు. 

2 వ తేదీన సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖతో చర్చలు 

తెలంగాణ ఎన్నికల్లో కలిసి పని చేయాలన్న అభిలాషను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభద్రం వ్యక్తం చేసిన అంశంపై ప్యాక్ సమావేశంలో చర్చించారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు సీపీఎం తెలంగాణ నాయకులను జనసేన చర్చలకు ఆహ్వానించింది. సెప్టెంబర్ 2 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జనసేన కార్యాలయంలో జనసేన, సీపీఎంల మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతాయి. జనసేన తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాధరం, రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్, పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జి శ్రీ ఎన్.శంకర్ గౌడ్ పాల్గొంటారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

 

31 Aug, 2018 0 336
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved