పాయల్ రాజ్ పుత్ ఇంటర్వ్యూ
విభాగం: సినిమా వార్తలు
payal-raj-puth-interview_g2d

కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్100’ ఈ చిత్రం ఈ నెల 12 న విడుదలవుతున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ పాయల్ రాజపుత్ మీడియా తో మాట్లాడారు.
ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం !

ఎటువంటి రోల్స్ చేయడానికి ఇష్టపడతారు?
నేను ముందుగా సినిమా కథ, కథనం, దర్శకుడు, అలానే ఎవరు హీరోగా చేస్తున్నారు, బ్యానర్ ఎటువంటిది అనే అంశాలను నేను పరిగణాల లోకి తీసుకుంటాను. ఎటువంటి రోల్ అయినా సరే నన్ను ఇంప్రెస్స్ చేస్తే చేయడానికి నేను సిద్ధం

ఈ సినిమాలో మీరు క్యారెక్టర్ గురించి విన్నాక మీకు ఏమనిపించింది?
ఈ సినిమాలో నేను చేస్తున్న ఈ క్యారెక్టర్ చాల స్టైలిష్ గా, కొత్తగా, ట్రెండీ గా ఉంటుంది.ఒకరకంగా ఛాలెంజింగ్ గా కూడా ఉంటుంది. ఒక పంజాబీ అమ్మాయిగా నాకు మొదట్లో ఈ పాత్ర చేయగలనో లేదో అనిపించింది. కానీ మెల్లగా యూనిట్ తో అలవాటు పడ్డాక చేయగల ధైర్యం వచ్చేసింది.

ఈ సినిమాని ఒప్పుకోవడానికి కారణం?
ముఖ్యంగా స్క్రిప్ట్ అనే చెప్పాలి, ఈ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదివరకు మనం చాల లవ్ స్టోరీస్ చూసాము. కానీ ఇది ఒక డిఫరెంట్ టైపు అఫ్ లవ్ స్టోరీ. ముఖ్యంగా దర్శకుడు స్టోరీ చెప్పినపుడు ఇందులో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉందని అర్ధమైంది. అందుకే ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాను.

 సినిమా డైరెక్టర్ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారు?

ముందుగా దర్శకులు అజయ్ నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పగానే, కథలోనే ఏదో కొత్త దానం ఉందనిపించింది. అంతే కాదు అయన వర్మ గారి అసిస్టెంట్ అవడం వాళ్ళ ఖచ్చింతగా ఆయనలో ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటుంది అనుకున్నాను. నిజంగా కథపై సినిమాపై ఆయనకు ఒక క్లియర్ విజన్ వుంది. దాని ప్రకారమే చాల జాగ్రత్తగా సినిమాని తెరకెక్కించారు.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండనుంది?
సినిమలో ఒకరకంగా నేనే హీరో అని చెప్పుకోవాలి. కథను బట్టి చూస్తే నా క్యారెక్టర్ కి అంత ఇంపాక్ట్ ఉంటుంది. నా క్యారెక్టర్ కి తగ్గట్లు నేను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసానని అనుకుంటున్నాను. పాత్రలో కొంత నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అది మీకు సినిమా చూస్తేనే కరెక్ట్ గా అర్ధమవుతుంది.

సినిమాలో లిప్ లాక్ సీన్లు వున్నాయి కదా, వాటిపై మీ అభిప్రాయం ఏంటి?
లిప్ లాక్ సీన్లు చేయడం నా దృష్టిలో తప్పేం కాదు. అది కేవలం కథలో భాగమయినపుడు ఒక్కోసారి చేయక తప్పదు. అయినా లిప్ లాక్ తప్పేమి కాదు కదా, మన భావాన్ని వ్యక్తపరచడానికి కొందరు తమ ఆవేదనని, ఇష్టాన్ని ముద్దుతో వ్యక్తపరుస్తుంటారు. అది భార్య భర్తలు కావచ్చు, లేదా లవర్స్ కావచ్చు. కాబట్టి అది కేవలం ఆ సన్నివేశంలో ఆ సందర్భాన్ని బట్టి లీప్ లాక్ సీన్ చేయవలసి వచ్చింది.

 మీరు ఇదివరకు సినిమాలు చేసారు, మరి ఈ సినిమాలో ఒక కొత్త హీరోతో చేయడం ఎలా అనిపించింది?

నేను ఇదివరకు సినిమాలు, యాడ్స్ చేశాను వాటిలో చేసేటపుడు నేను కూడా కోతే కదా. టాలీవుడ్ లో ఇది నాకు ఫస్ట్ సినిమా. నేను కథ విన్నపుడు ముందు కథనే హీరో గా అనుకున్నాను, అదే అసలు హీరో. ఇక హీరో ఎవరైనా చేయక తప్పదు. ఇక్కడ ఎవరి రికగ్నిషన్ వారికి ఉంటుంది. ఎవరి టాలెంట్ ని బట్టి వారు ఫీల్డ్ కి వస్తుంటారు. కాబట్టి కొత్త హీరో పాత హీరో అని నేను ఆలోచించను. కథ కథనాలు నచ్చాలి అంతే.

 ఈ సినిమాలో హీరో కార్తీక్ గురించి మీ అభిప్రాయం?
హీరో కార్తీక్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్. తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా వుంది. తాను మంచి గ్రేస్ వున్నా నటుడు. వర్క్ పట్ల డెడికేషన్ అండ్ హార్డ్ వర్కర్ కూడా. మా ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని నేను అనుకుంటున్నాను. ఇక మూవీ రిలీజ్ అయ్యాక మీరే చెప్పాలి ఎలా ఉందొ.

 మీకు ఈ మూవీలో పనిచేయడం ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది?
డైరెక్టర్ కార్తీక్, నిర్మాతలు మొదటి నుండి నాకు పూర్తి సపోర్ట్ అందించారు. నేను పంజాబీని అవడంవల్ల తెలుగు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటే ఎంతో హెల్ప్ చేశారు. ఎప్పుడైనా కొన్ని సీన్ల విషయంలో పొరపాట్లు ఉంటే చాలా పొలైట్ గా వ్యవహరించేవారు. అలానే ఈ చిత్రంలో రాంకీ, రావు రమేష్ వంటి సీనియర్ నటులతో పనిచేయడం చాలా బాగుంది. హీరో కార్తీక్ మంచి కో ఆర్టిస్ట్. వీరితో మళ్ళి మళ్లి వర్క్ చేయాలనీ కోరుకుంటున్నాను.

 ఈ సినిమాలో మీ లుక్ ఎలా ఉంటుంది?
చాల ట్రెడిషనల్ అమ్మాయిగా ఉంటుంది. దాని కోసం కొంచెం హోమ్ వర్క్ కూడా చేయవలసి వచ్చింది. ఇటువంటి ఛాలెంజింగ్ పాత్రలు వస్తే మళ్ళి చేయడానికి సిద్ధం.

 మీరు ఎటువంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?

నా క్యారెక్టర్ ను బట్టి ఒకసారి కథ మరియు నా పాత్ర నచ్చితే చాలు, అది ట్రెడిషనల్ కానీ, మోడరన్ కానీ, లేదా ఇకెటువంటి బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్దమే. ఫలానా టైపు పాత్రలే చేయాలి అనే రూల్ నాకు లేదు

 

SOURCE:123TELUGU.COM

06 Jul, 2018 0 1116
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved