ప్రభాస్, అనుష్క పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన స్వీటి వాళ్ళ అమ్మ
విభాగం: సినిమా వార్తలు
prabhas,-anushka's-wedding-is-a-sweetheart-given-by-clarity_g2d

బాహుబలిలో కలిసి నటించిన ప్రభాస్-అనుష్క జోడిపై రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంటుంది. అంతకుముందు వరుస సినిమాలలో కలిసి నటించడంతో అందరూ వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం చేశారు.   తెరపై అద్భుతమైన జోడీగా పేరొందిన వీరు బయట కూడా జోడి కడితే బాగుంటుందని అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా గాసిప్పులు వచ్చాయి.

ఇటీవలే  ప్రభాస్ ఈ వార్తలపై స్పందించారు. జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. అనుష్కను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగగా.. ‘ఇది నా వ్యక్తిగత విషయం.. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే’ అని క్లారిటీ ఇచ్చాడు.

ఇక అనుష్క వాళ్ల అమ్మ కూడా స్వీటికి పెళ్లి చేయాలని కృతనిశ్చయంతో ఉందట.. ఇప్పటికే అనుష్కకు ఉన్న దోషాలు పోవాలని దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలను సందర్శించి అనుష్కకు పూజలు చేయించిందనే వార్త కూడా వెలువడింది. ఓ మంచి భర్త అనుష్కకు రావాలని గుడులు గోపురాలు తిరిగిందట...

తాజాగా అనుష్క తల్లి కూడా ఓ వెబ్ సైట్ తో మాట్లాడినట్టు కథనం వెలువడింది. ప్రభాస్-అనుష్క పెళ్లి వార్తలపై స్పందించాలని అడగగా ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చింది. ‘ప్రభాస్-అనుష్క ఇద్దరూ వెండితెరపై పెద్ద స్టార్స్. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రభాస్ ఓ మిస్టర్ పర్ ఫెక్ట్. అతడు అనుష్కకు భర్త రావాలని నేనూ కోరుకుంటున్నా. అతడంటే నాకు ఇష్టమే.. కానీ అనుష్క-ప్రభాస్ లు ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. ఇప్పటికైనా వారి పెళ్లి వార్తలపై ప్రచారం ఆపండి.. వారిద్దరి పెళ్లి అనేది వట్టి రూమర్ మాత్రమే’ అని కుండబద్దలు కొట్టింది.  అనుష్క తల్లి క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికైనా ప్రభాస్-అనుష్క పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి

 

SOURCE:TUPAKI.COM

20 Jul, 2018 0 374
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved