ప్రభాస్‌కి పుష్‌ ఎవరిస్తారు
విభాగం: సినిమా వార్తలు
prabhas-push-up_g2d

పేరుకి బాహుబలి హీరోనే కానీ, ఆ పేరు చెప్పుకుని ప్రభాస్‌కి బాలీవుడ్‌ నుంచి పేరున్న నటీనటుల డేట్స్‌ దొరకలేదు. సాహో చిత్రాన్ని హిందీలోను క్రేజీగా మార్చడం కోసం స్టార్‌లైన బాలీవుడ్‌ నటులని తీసుకుందామని చూసారు. కానీ బాహుబలితో నటించడానికి ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో సెకండ్‌, థర్డ్‌ గ్రేడ్‌ బాలీవుడ్‌ యాక్టర్లతోనే సాహో చేసేస్తున్నారు. ఇదిలావుంటే సాహో హిందీ వెర్షన్‌కి ఏదైనా పెద్ద నిర్మాణ సంస్థ నుంచి అన్‌కండిషనల్‌ సపోర్ట్‌ వస్తుందని ఆశించారు. 

కానీ కరణ్‌ జోహార్‌తో ప్రభాస్‌ పేచీ పెట్టుకోవడంతో ఇంతవరకు సాహోకి సరయిన ఆప్షన్‌ దొరకలేదు. బాహుబలి చిత్రానికి వచ్చినట్టుగా దీనికి క్రేజ్‌ రావాలంటే కరణ్‌ జోహార్‌ లాంటి పెద్ద నిర్మాత సపోర్ట్‌ చాలా అవసరం. కరణ్‌ మీడియా మేనేజ్‌మెంట్‌. అతని ప్రమోషన్‌ టాక్టిక్స్‌ బాహుబలికి చాలా దోహదపడ్డాయి. కానీ సాహోకి ఇంతవరకు అలా పుష్‌ ఇచ్చే నిర్మాత ఎవరూ దొరకలేదు. ప్రభాస్‌ మినహా ఈ చిత్రానికి ఆకర్షణలు ఏమీ లేవు. 

కాకపోతే భారీ నిర్మాణ విలువలతో హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లరా అనిపించే రీతిన తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి టీజర్‌ విడుదలైన తర్వాత బయ్యర్లు బారులు తీరతారని, బడా నిర్మాతలు కూడా ఇందులో భాగస్వామ్యం కోరుకుంటారని సాహో టీమ్‌ ఆశిస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి తగినంత పబ్లిసిటీ చేయడం లేదని, కనీసం ప్రభాస్‌ స్టిల్‌ కూడా రిలీజ్‌ చేయలేదని ఫాన్స్‌ గొడవ ఎక్కువయింది. వచ్చే వేసవికి గానీ రాని ఈ చిత్రానికి రియల్‌ పబ్లిసిటీ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో మరి

 

SOURCE:GULTE.COM

11 Jul, 2018 0 364
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved